ఛీ, ఛీ..! రూ. 5కోట్లు ఇచ్చినా భార్య ప్రైవేటు వీడియోను వైరల్ చేస్తానన్న భర్త..!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భర్త చేసిన ఓ సిగ్గుచేటు చర్య వెలుగులోకి వచ్చి అందర్నీ విస్తుపోయేలా చేస్తుంది. తాజాగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న భార్య రెండు కోట్ల కట్నం డిమాండ్ చేసేందుకు తన భర్త తాను స్నానం చేసేప్పుడు వీడియో తీశాడని, వైరల్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త, అత్తమామలతో సహా ఐదుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసు నగర ప్రాంతానికి చెందినది. తిలక్ నగర్‌లో నివసిస్తున్న యువతికి 2019 వ సంవత్సరం లో స్వరూప్ నగర్‌లోని ఒక యువకుడితో వివాహం జరిగింది. ఐతే ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు. పెళ్లిలో ఆమె కుటుంబం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆ మహిళ తెలిపింది. అయినప్పటికీ ఆమె భర్త, అత్త వ్యాపారం కోసం రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బు డిమాండ్ తీర్చనప్పుడు భర్త, అత్త ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు.
ఆ వివాహిత చెప్పిన ప్రకారం ఆమె కుటుంబం తన భర్తకు స్వరూప్ నగర్ లో ఇల్లు, కారు కూడా కొనిచ్చింది. అయినప్పటికీ, అతను రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ నెరవేర్చనప్పుడు... ఆమె స్నానం చేసేటప్పుడు రహస్యంగా వీడియో తీసాడు. ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించడం ద్వారా డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించాడు.
బాధపడిన ఆ మహిళ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులను వేడుకుంది. మహిళ తహ్రీర్ ఫిర్యాదు మేరకు కేసుని నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా నేటి సమాజంలో కట్న పిశాచులు ఆడపిల్లల తల్లిదండ్రులను బతికుండగానే పీక్కుతింటున్నారు. అత్తమామల వరకట్న వేధింపులు, భర్త అనుమానాల కారణంగా అన్యాయం గా బలి అవుతున్న యువతుల సంఖ్య నానాటికి పెరిగిపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా బాగా డబ్బులు ఉన్నవారే ఇలాంటి వరకట్న వేధింపులకు పాల్పడటం గమనార్హం.