కేజ్రీవాల్ ను దెబ్బ కొట్టేందుకు మోడి సూపర్ స్కెచ్ ? ...  ఏంటో తెలుసా ?

Vijaya
ఢిల్లీ సిఎం అరివింద్ కేజ్రీవాల్  ప్రధానమంత్రి నరేంద్రమోడి మరీ ఇంత చీప్ గా వ్యవహరించారా ? ఇపుడిదే అంశంపై యావత్ దేశంలోనే చర్చ మొదలైంది. ఢిల్లీ ఎన్నికల విషయంలో కేజ్రీవాల్ నామినేషన్ వేయటానికి వచ్చినపుడు జరిగిన పరిణామాలే  మోడి వైఖరిపై ఆరోపణలు, విమర్శలు రేగేట్లుగా చేసింది. న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో నామినేషన్ వేయటానికి కేజ్రీవాల్ రిటర్నింగ్ అధికారి దగ్గరకు వచ్చినపుడు పెద్ద డ్రామానే జరిగింది. దాంతో  కేంద్రప్రభుత్వంపై విమర్శల వాన మొదలైంది.

ఇంతకీ విషయం ఏమిటంటే కేజ్రీవాల్ తన నామినేషన్ వేయటానికి సోమవారమే రెడీ అయ్యారు. అయితే ఊరేగింపు , ట్రాఫిక్ తదితరాల వల్ల  నామినేషన్ వేయాల్సిన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకునేటప్పటికి బాగా లేటైంది. ఇది సిఎం తప్పే అనటంలో సందేహం లేదు.  నామినేషన్ వేయటానికి వీలుగా ముందుగానే అరవింద్ జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

సరే జరిగిందేదో జరిగిపోయిందని నామినేషన్ వేయటానికి మళ్ళీ మంగళవారం ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలోనే  రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి గడువు. అయితే గడువులోనే కేజ్రీవాల్ ఆఫీసుకు చేరుకున్నారు. సిఎం చేరుకోగానే టోకెన్ ఇచ్చారు. కేజ్రీవాల్ టోకెన్ నెంబర్ 45.

ఇక్కడే  అసలు ట్విస్టంతా బయటపడింది. ఆ ట్విస్టు ఏమిటంటే  కేజ్రీవాల్ ముందు నామినేషన్లు వేయాలని వెయిట్ చేస్తున్న వారిలో ఎవరూ సీనియస్ అభ్యర్ధులు కాదు. ఎందుకంటే  వాళ్ళ నిమినేషన్ కు మద్దతు ఇవ్వాల్సిన పదిమంది కూడా ఎవరి పత్రంలోను సంతకాలు చేయలేదు. ఆఫీసులో కూర్చుని అందరినీ రమ్మంటూ బతిమలాడుకుంటున్నారు.

ప్రతి నామినేషన్ తినిఖీ చేయటం రెజెక్టు చేయటం. ఇలాగే అన్నీ నామినేషన్లు జరిగాయి.  దాంతో అందరూ కలిసే డ్రామాలాడుతున్నట్లు స్పష్టంగా అర్ధమైపోయింది. ఈ డ్రామాలు ఎందుకాడుతున్నారంటే కేజ్రీవాల్ నామినేషన్ ను వేయనీయకుండానే. కాకపోతే టోకెన్ తీసేసుకున్నారు కాబట్టి కచ్చితంగా నామినేషన్ తీసుకోవాల్సింది. ఆ పద్దతిలోనే కేజ్రీవాల్ నామినేషన్ తీసుకునేటప్పటికి రాత్రి 7 గంటలైంది.

కేజ్రీవాల్ నామినేషన్ అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికుంది ? ఎవరికంటే మోడికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో మళ్ళీ కేజ్రీవాల్ దే గెలుపని అన్నీ సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. మోడి కంట్లో అరవింద్ నలుసు లాగ తయారైన విషయం అందరికీ తెలిసిందే. అందుకనే అసలు నామినేషన్ దశలోనే తిరస్కరించేస్తే సరిపోతుందని పెద్ద ప్లానే వేశారు కాకపోతే ఆ విషయాన్ని గ్రహించి కేజ్రీవాల్ ముందు జాగ్రత్త పడటంతో  బిజెపి పప్పులుడకలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: