జనసేన అధినేత పవన్ కల్యాన్ ఢిల్లీ టూరులో హిడెన్ అజెండా ఏమిటి ? ఇపుడిదే అంశంపై చర్చ జరుగుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చంద్రబాబునాయుడు తరపున వకాల్తా పుచ్చుకోవటానికే పవన్ బిజెపి అగ్ర నేతలను కలుద్దామని అనుకున్నారట. బిజెపితో జనసేన పొత్తు, విలీనం అనేది ఆటలో అరటిపండు లాంటివేనట. అసలైతే చంద్రబాబు విషయం మాట్లాడుదామనే వెళ్ళినట్లు సమాచారం.
బిజెపి అగ్రనేతల్లో ఎవరు ఫోన్ చేస్తే పవన్ హడావుడిగా ఢిల్లీకి వెళ్ళారో తెలీలేదు. అయితే ఢిల్లాలో దాదాపు మూడు రోజులు వృధాగానే కాలం గడిపేశారు. ప్రధానమంత్రి, అమిత్ షాలను కలుద్దామని పవన్ అనుకున్నారట. అయితే వాళ్ళిద్దరూ తీరికలేనంత బిజీగా ఉండటంతో చివరకు మూడో రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డాను కలిసి ఫొటోలకు ఫోజులిచ్చి బయటకు వచ్చేశారు.
జగన్మోహన్ రెడ్డి దూకుడును అడ్డుకోవటం చంద్రబాబు, పవన్ వల్ల కావటం లేదన్నది వాస్తవం. జగన్ రాజకీయ ఎత్తుల ముందు ఇద్దరూ నేతలు ఎందుకూ పనికిరాకుండా తేలిపోతున్నారు. గడచిన ఏడు నెలల్లోనే వాళ్ళిద్దరూ ఇంత చిత్తయిపోతే మిగిలిన నాలుగున్నరేళ్ళు ఎలా జగన్ను ఎదుర్కోవాలన్న టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే మూడో శక్తి అండ లేకుండా సాధ్యం కాదని అర్ధమైపోయింది.
బిజెపితో మళ్ళీ సయోధ్యకు చంద్రబాబు నేరుగా ప్రయత్నం చేసినా అటునుండి రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే ఒరిజినల్ బిజెపి నేతలు చంద్రబాబును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఏం చేయాలో అర్ధంకాకే చివరకు తన బినామీ ఎంపిలు సుజనాచౌదరి, సిఎం రమేష్ లాంటి వాళ్ళను బిజెపిలోకి పంపారు. చివరకు వాళ్ళు కూడా ఫెయిలయ్యారు. దాంతో పవన్నే రంగంలోకి దింపారట. ఈ విషయాన్నే పవన్ ప్రతిపాదించారట. పవన్ ప్రతిపాదనను నడ్డా విన్న తర్వాత ప్రధానమంత్రి, అమిత్ షా తో మాట్లాడి ఏ సంగతి చెబుతానని చెప్పి పవన్ ను పంపేశారట.
మరింత సమాచారం తెలుసుకోండి: