జగన్ పాలన బాగుంటుంది అనుకున్నా.. కానీ..?

praveen

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వినూత్న పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది జగన్ పాలన తప్పు పడుతూ ఉంటే ఇంకొంతమంది ప్రశంసిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ పాలన కక్ష సాధింపు ల తో నడుస్తుందని... ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ఆరోపించింది అని సిపిఐ నేత నారాయణ తెలిపారు. కానీ ఇప్పుడు జగన్ కూడా అదే తరహా పాలన  చేస్తున్నారంటూ ఆయన అన్నారు. జగన్ పాలన బాగుంటుందని తాను భావించానని తెలిపారు. 

 

 

 కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జగన్ కు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉందని... వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత  ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకొని ఇప్పుడు ప్రతిపక్ష హోదా లో కూర్చున్నదని  ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం మాదిరిగానే  మీరు కూడా పాలిస్తాం  అంటే రానున్న రోజుల్లో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి  వస్తుంది అంటూ జగన్ మోహన్ రెడ్డి సర్కారును హెచ్చరించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. 

 

 

 

 రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి ఆలోచనల మేరకే అధికారులు పని చేస్తారని  నారాయణ హితవు  పలికారు. గత ఎన్నికలకు ముందు టిడిపి అణగదొక్కేందుకు   జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి... బిజెపి ప్రభుత్వం సీఎస్  పదవిని కట్టబెట్టి లేదా అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. నాటి చంద్రబాబు పాలన నేటి జగన్ పాలన ఒకే తరహాలో సాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రాజధాని రగడ  భగ్గుమన్న విషయం తెలిసిందే.జగన్  ప్రకటించిన 3 రాజధానిలో నిర్ణయం ప్రస్తుతం ఆంధ్ర  రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: