తెలుగుదేశంపార్టి ఏమి చేసినా అందులో నాటకీయతే ఎక్కువగా ఉంటోంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత నాటకీయత మరీ ఎక్కువ అయిపోయింది. తాజాగా ఇటువంటి ప్రహసనమే మళ్ళీ కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయంలో రాష్ట్రంలో మంటలు రేగుతున్న విషయం తెలిసిందే.. ఈ మంటలు ఎక్కువగా రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబానాయుడు లేకపోతే టిడిపి చేస్తున్న ఆందోళనల్లో పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కువగా కనిపిస్తున్నారు. టిడిపికి పెయిడ్ ఆర్టిస్టులతో ఏమి పనంటే అసలు నేతలు పెద్దట సీరియస్ గా లేరు కాబట్టే. మొన్న వరదలు, భారీ వర్షాలు కురిసినపుడు పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ ను తిట్టించింది టిడిపి. మొత్తానికి ఆ పెయిడ్ ఆర్టిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.
తర్వాత ఇసుక కొరత పేరుతో చేసిన ఆందోళనల్లో కూడా పెయిడ్ ఆర్టిస్టులే దర్శనమిచ్చారు. స్వయంగా చంద్రబాబు చేసిన 12 గంటల దీక్షలో కూడా ఎక్కడ చూసినా పెయిడ్ ఆర్టిస్టులే కనిపించి పార్టీ పరువు తీసేశారు. చివరకు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించన సమయంలో కూడా పెయిడ్ ఆర్టిస్టులను జాగ్రత్తగా చూసుకోవాలని స్వయంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ గా మారింది.
తాజాగా రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనల్లో కూడా పెయిడ్ ఆర్టిస్టులే కనబడుతున్నారు. ముందుగా వీళ్ళకు జగన్ ప్రభుత్వంపై ఎటువంటి ఆరోపణలు చేయాలి, మీడియా ముందు ఏమి మాట్లాడాలి లాంటి అంశాలపై టిడిపి నేతలు ట్రైనింగ్ ఇచ్చి మరీ శిబిరాల్లోను, రోడ్లపైన కూర్చోబెడుతున్నారు.
ఇపుడు జరుగుతున్న ఆందోళనల్లో అయితే బీర్లు, బిర్యానీలు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులను మరీ పిలిపిస్తున్న విషయాలు అందరికీ తెలిసిపోతునే ఉంది. ఆందోళనలు జరిగే చోటే టెంట్లు వేసి వాటి వెనకాల బీర్లు తాగేవాళ్ళు తాగుతున్నారు. బిర్యానీలు తినేవారు తింటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఆందోళనల్లో స్కూళ్ళకు వెళ్ళే పిల్లలను కూడా తీసుకొచ్చి కూర్చొబెడుతుండటం. అందుకనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టిడిపి పెయిడ్ ఆర్టిస్టులతో ఆందోళనలు చేస్తోందంటూ ఎద్దేవా చేసింది.
మరింత సమాచారం తెలుసుకోండి: