సంచలనం :  టిడిపి ఎంఎల్ఏలకు  ఎన్ కౌంటర్ బెదిరింపులు

Vijaya
తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలను ఎన్ కౌంటర్ చేయటానికి ప్లాన్ జరుగుతోందా ? అదికూడా తెలంగాణాలో దిశ హత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్లే చేస్తామని ఇప్పటికే బెదిరింపులు మొదలయ్యాయా ? అధికార వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది. టిడిపి ఎంఎల్ఏలను ఎన్ కౌంటర్ చేస్తామని వైసిపి నుండి బెదిరింపులు వచ్చాయో లేదో తెలీదు కానీ చంద్రబాబు మాత్రం తీవ్రమైన ఆరోపణలే చేశారు.

టిడిపి ఎంఎల్ఏలను లాక్కోవాలని వైసిపి తీవ్రంగా ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తాము చెప్పినట్లుగా పార్టీ మారకపోతే దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్లే మిమ్మల్ని కూడా ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నట్లుగా చెప్పారు. పైగా తమ ఎంఎల్ఏలను ఏదో ఓ రేప్ కేసులో ఇరికించి మరీ ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించటం దారుణమంటూ చంద్రబాబు మండిపోయారు. 

చంద్రబాబు చేసిన ఆరోపణలు చాలా సీరియస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ ఒక్క టిడిపి ఎంఎల్ఏని కూడా వైసిపిలోకి చేర్చుకోలేదు. నిజానికి టిడిపిలో ఉండలేక తాము వచ్చేస్తామని అడిగినా జగన్మోహన్ రెడ్డి వద్దనే అంటున్నారు. ఒకవేళ ఎవరినైనా తీసుకోవాల్సొస్తే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తేనే ఆలోచిస్తామని స్పష్టంగా చెప్పారు. గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ ఉదంతమే ఇందుకు నిదర్శనం.

టిడిపిలో ఇమడలేకపోవటంతో వంశీకి చంద్రబాబుకు విభేదాలు మొదలయ్యాయి. దాంతో వంశీ టిడిపికి రాజీనామా చేశారు. తర్వాత పరిణామాల్లో చంద్రబాబు ఎంఎల్ఏను సస్పెండ్ చేశారు. తాను జగన్ తో కలిసి పనిచేస్తానని వంశీ ప్రకటించినా ఆయన్ను వైసిపిలోకి తీసుకోలేదు. ఎంఎల్ఏగా రాజీనామా చేసేంతవరకూ ఎవరినీ తమ పార్టీలోకి తీసుకోమని స్పష్టంగా చెప్పేశారు. అంటే చంద్రబాబు చెప్పింది చూస్తుంటే గతంలో 23 మంది వైసిపి ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను ఇలాగే బెదిరించే చంద్రబాబు లాక్కున్నారా ?  చంద్రబాబు ముందు దానికి సమాధానం చెప్పి తర్వాత జగన్ పై ఆరోపణలు చేస్తే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: