అమరావతి కల్ప వృక్షం వర్సెస్ అమరావతి మయసభ?

Reddy P Rajasekhar

ఈరోజు విజయవాడలో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం జరగగా తుళ్లూరులో రైతుల, కూలీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అమరావతిలో ఏం జరుగుతోందో తెలిపేందుకే అని చంద్రబాబు అన్నారు. భావి తరాల భవిష్యత్ అమరావతి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 
 
ప్రజలందరిపై అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు అన్నారు. ప్రజా చైతన్యం వలనే అమరావతి నిలబడుతుందని అమరావతిపై లేని పోని అపోహలు సృష్టిస్తున్నారని చంద్రబాబు అన్నారు. సంపద సృష్టి, ఉపాధి కల్పన లక్ష్యంగా అమరావతిని నిర్మించాలనుకున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రజారాజధానిని ప్రతి తెలుగు బిడ్డ గర్వించే విధంగా నిర్మించాలని తలపెట్టామని చెప్పారు. 
 
అమరావతిని చంద్రబాబు కల్పవృక్షంలా చెబుతూ ఉంటే వైసీపీ నేతలు మాత్రం అమరావతిని మయసభతో అని చెబుతూ ఉన్నారు. రాజధాని రైతులు, కూలీలు ఇప్పటికే చంద్రబాబు అన్యాయం చేశాడని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే అక్కడ శాశ్వత భవనం ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ప్రశ్నించారు. 
 
చంద్రబాబు 40 సంవత్సరాల అనుభవం అని చెబుతారని మరి చంద్రబాబుపై రాళ్లు ఎందుకు పడుతున్నాయని శ్రీదేవి ప్రశ్నించారు. అధికారంలో ఉండగా చంద్రబాబు గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని శ్రీదేవి ప్రశ్నించారు. చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని శ్రీదేవి చెప్పారు. లిమ్కా బుక్ రికార్డులో చంద్రబాబు అక్రమాల చిట్టా ఎక్కుతుందని వ్యాఖ్యలు చేశారు. దళితుల అసైన్డ్ భూములకు చంద్రబాబు తీరని అన్యాయం చేశాడని చెప్పారు. చంద్రబాబు అమరావతి శిల్పి కాదు అమరావతి దొంగ అని అంటున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అమరావతిని కల్పవృక్షం అని చెబుతూ ఉంటే వైసీపీ నేతలు మాత్రం మయసభ అని చెబుతూ ఉండటం గమనార్హం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: