రైతులకు నిజంగానే భరోసా..జగన్ లేటెస్ట్ డెసిషన్

Vijaya

రైతులకు నిజంగానే భరోసా కల్పించే నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. రైతు భరోసా పథకం క్రింద రైతులకు ఏడాదికి అందించనున్న మొత్తాన్ని రూ. 12500 నుండి రూ. 13500కు పెంచాలని డిసైడ్ అయ్యారు. అంటే వెయ్యి రూపాయలు పెరుగుతుందన్నమాట. అలాగే ఈ పథకాన్ని నాలుగేళ్ళ పాటు అమలు చేయాలని మొదట నిర్ణయించారు.

 

కానీ తాజాగా జరిగిన సమావేశంలో పథకాన్ని ఐదేళ్ళకు పెంచాలని కూడా నిర్ణయించారు. రైతు భరోసా పథకాన్ని పిఎం కిసాన్ సమ్మాన్ పథకం క్రింద పేరు  కూడా మార్చారు. మొత్తానికి రైతు భరోసా పథకం లాంచ్ విషయమై ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో రైతులకు నిజంగా భరోసా కలిగించే నిర్ణయాలు తీసుకున్నారనటంలో సందేహం లేదు.

 

రైతులకు దీర్ఘకాల ప్రయోజనాలు కలిగించటంలో జగన్ గట్టి నిర్ణయాలే తీసుకుంటున్నారనటంలో సందేహం లేదు.  అదే సమయంలో కేంద్రప్రభుత్వం కూడా రైతులకు కిసాన్ సమ్మాన్ పథకంలో ఏడాదికి రూ. 6500 ఖాతాల్లో వేస్తోంది. కాబట్టి జగన్ తన పథకంలో కాస్త మార్పులు చేర్పులు చేసి రైతులకు ఇస్తానన్న ఏడాదికి రూ. 12500లకు బదులుగా రూ. 6500 ఇవ్వాలని నిర్ణయించారు.

 

ఎటూ రైతులకు కేంద్రం ఏడాదికి 6500 ఇస్తోంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 6500 ఇస్తే సరిపోతుందని జగన్  నిర్ణయించారు. అదే సమయంలో కౌలు రైతులకు మాత్రం ఏడాదికి రూ. 12500 ఇవ్వాల్సిందే అని డిసైడ్ చేశారు. ఎందుకంటే కౌలు రైతులను కేంద్రం పట్టించుకోలేదు. కాబట్టి జగన్ నిర్ణయం ప్రకారం ఏడాదికి రూ. 12500 వస్తుంది. అదే సమయంలో మిగిలిన రైతులకు కూడా ఏడాది కేంద్రం+రాష్ట్ర సాయంతో ఏడాదికి రూ. 12500 వస్తుంది. అయితే తాజాగా పెరిగిన మొత్తం ప్రకారం ప్రతి కౌలు రైతుకు ఏడాదికి రూ. 13500 రావటం ఖాయం. కాబట్టి రైతుకు జగన్ నిజంగా భరోసా ఇస్తున్నట్లే.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: