దొనకొండలో ఏం జరుగుతోందో తెలుసా ?

Vijaya

ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలుసా ? ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి. దొనకొండ ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించబోతోందంటూ జరుగుతున్న ప్రచారంతో భూముల ధరలు పెరిగిపోతున్నాయట. 15 రోజుల క్రితం వరకు కూడా లక్షో , రెండు లక్షలో ఉన్న ఎకరా ధర సుమారు 15 లక్షల రూపాయలకు చేరుకుందని స్ధానికులే చెబుతున్నారు.

 

రాజధానిగా దొనకొండ అంటూ జిల్లాలో కూడా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దీనికంతటికి మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. రాజధాని ప్రాంతం వర్షానికి ముణిగిపోతుందని, ఇతర ప్రాంతాల్లో నిర్మాణాలకు అయ్యే ఖర్చుకన్నా అమరావతి ప్రాంతంలో చాలా ఎక్కువ అవుతుందని బొత్సా అన్నారు. జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని బొత్సా అనటంతోనే అందరిలోను అనుమానాలు పెరిగిపోయాయి.

 

బొత్సా అలా మాట్లాడారో లేదో వెంటనే టిడిపి నేతలు అలర్టయిపోయారు. ఇంకేముంది టిడిపి నేతలకు పండగే పండగ. జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని నానా మాటలు అంటున్నారు. రాజధాని గురించి మాట్లాడింది బొత్స అయితే టిడిపి నేతలు టార్గెట్ చేస్తున్నది మాత్రం జగన్ ను.

 

రాజధాని ప్రాంతాన్ని మారిస్తే రైతులతో మహా నిరాహారదీక్షకు దిగుతామంటూ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అల్టిమేటమ్ ఇచ్చేశారు. రాజధానిని మార్చాలని నిర్ణయిస్తే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానంటూ చెప్పటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

నిజానికి అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దని శివరామకృష్ణన్ కమిటితో పాటు ఎంతోమంది నిపుణులు అప్పట్లోనే హెచ్చరించారు. అయినా చంద్రబాబునాయుడు వినకుండా కేవలం తమ సామాజికవర్గం ప్రయోజనాల కోసమే అమరావతిని రాజధానిగా చేసుకున్నారు. అప్పటి నుండి ఒకటే సమస్యలు మొదలయ్యాయి. అయినా అమరావతిని మార్చేందుకు లేదంటూ టిడిపి నేతలు ఒక్కొక్కరుగా మాట్లాడటం మొదలుపెట్టారు. మరి జగన్ అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏ మాట్లాడుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: