ఎడిటోరియల్ : చంద్రబాబు కష్టాలకు సెక్రటేరియట్ వాస్తు దోషాలే కారణమా ?
చంద్రబాబునాయుడుకు
జాకీలేసి లేపే ప్రయత్నం చేస్తున్న జాతి మీడియా తాజాగా వాస్తుదోషాలపై పడింది.
సెక్రటేరియట్ కు వాస్తుదోషం ఉందని సిద్ధాంతి గోటూరి పాములు షాకింగ్ విషయాలు
వెల్లడించారంటూ ఊదరగొడుతోంది. అంటే సచివాలయంకు వాస్తుదోషలున్నాయి కాబట్టే చంద్రబాబు
ఇబ్బందులు పడుతున్నారని సదరు తోక పత్రిక చెప్పదలచుకున్నట్లు అర్ధమైపోతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో టిడిపి ఓటమి ఖాయమని
వెలువడిన మరుసటి రోజే ఆ వార్త ప్రచురించటంలో అర్ధమేంటి ?
సిద్ధాంతి పాములు చెబుతున్నది నిజమే అయితే ఇంత కాలం ఆయన ఏం చేస్తున్నట్లు ? తాత్కాలికంగా నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ భవనాలు ఏమీ రహస్య నిర్మాణాలు కావే. దాదాపు రెండున్నర సంవత్సరం క్రిందట నిర్మించే సమయంలో ఈ సిద్ధాంతి ఏం చేస్తున్నారు ? భవనాల ప్రారంభించిన సమయంలో అయినా వాస్తుదోషాలను ఎందుకు చెప్పలేదు ?
వాస్తుదోషాల వల్లే చంద్రబాబుకు ఇబ్బందులని చెబుతున్న ఈ సిద్ధాంతి రాబోయే సిఎంకు కూడా కష్టాలు తప్పవని చెప్పినట్లుగా తోక పత్రిక చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటి ? అంటే జగన్మోహన్ రెడ్డి సిఎం అయినా కష్టాలు తప్పవని భయపెట్టటమే సిద్దాంతి, తోక పత్రిక ఉద్దేశ్యమా ? అసలు తాత్కాలిక సచివాలయ నిర్మాణం కూడా ఎంతోమంది సిద్ధాంతులకు చూపించిన తర్వాతే నర్మించారన్న విషయాన్ని తోక పత్రిక మరచిపోయినట్లుంది.
సెక్రటేరియట్ రూట్ ఎండ్ కి కట్టారట. ముఖ్యమంత్రి కార్యాలయం ముందు అసెంబ్లీ భవనం కట్టారట. తూర్పు మూతపడిపోవటం వల్ల నష్టాలు జరుగుతాయట. ఒక్క ఈశాన్య గేట్ ఏర్పాటు తప్ప మొత్తం సెక్రటేరియట్ నిర్మాణమంతా వాస్తు దోషాలతోనే కట్టారని ఈ సిద్దాంతి ఇపుడు తీరిగ్గా చెబుతున్నారు.
చంద్రబాబు అధికారంలోకి రాగానే హైదరాబాద్ లోని సెక్రటేరియట్ భవనాలను కూడా వాస్తు ప్రకారమే రెడీ చేయించుకున్నారు. అంతా రెడీ అయ్యిందన్న తర్వాతే ప్రత్యేక పూజలు చేసి చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. వాస్తు ప్రకారం మార్పులు, ప్రత్యేక పూజలు చేసి చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఏమైంది ? ఎనిమిది నెలలకే ఓటుకునోటు కేసులో తగులుకుని విజయవాడ పారిపోయారు. బహుశా ఆ విషయాన్ని తోక పత్రిక మరచిపోయినట్లుంది. జగన్ సిఎం అయితే ఎలాగూ తనకు కావాల్సినట్లే సరిచేయించుకుంటారు కదా.