జగన్ ఇంటిని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారా ?

Vijaya

జగన్ నిర్మించుకున్న నూతన ఇంటిని చూసి చంద్రబాబునాయుడు తట్టుకోలేకపోతున్నారా ?  అమరావతి ప్రాంతంలోని తాడేపల్లి బైపాస్ రోడ్డుకు దగ్గరలో వైసిసి కేంద్ర కార్యాలయంతో పాటు జగన్ సొంతింటిని కూడా నిర్మించుకున్నారు. ఈరోజు ఉదయం గృహప్రవేశం కూడా చేశారు. అదే విషయమై టిడిపి నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు మాట్లాడుతూ, ప్యాలెస్ లేకపోతే జగన్ నివసించలేరంటూ మండిపడ్డారు. 

 

హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఓ ప్యాలెస్, బెంగుళూరులో మరో ప్యాలెస్, పులివెందులలో ఇంకో ప్యాలెస్ నిర్మించుకున్న జగన్ తాజాగా తాడేపల్లిలో కూడా కొత్తగా ప్యాలెస్ నిర్మించుకున్నారంటూ తన అక్కసును వెళ్ళగక్కారు. ఇంతకాలం హైదరాబాద్ లో ఉంటూ ఏపిలో రాజకీయాలు చేస్తున్నారని జగన్ ను విమర్శించింది, ఆరోపణలు చేసింది చంద్రబాబు అండ్ కో నే. తీరా అమరావతి ప్రాంతంలో సొంతంగా ఇంటిని, పార్టీ కార్యాలయాన్ని నిర్మింకుంటే ప్యాలెస్ నిర్మించుకున్నారంటూ ఆడిపోసుకుంటున్నదీ చంద్రబాబే. అంటే జగన్ ఏ పనిచేసినా తప్పే ఏమీ చేయకపోయినా తప్పే అన్నట్లుంది చంద్రబాబు వరస.

 

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో సుమారు 22 వేల చదరపు అడుగుల్లో ప్యాలెస్ నిర్మించుకున్న చంద్రబాబు కూడా జగన్ ను విమర్శిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కనీసం జగన్ గృహప్రవేశానికి కొన్ని వందలమందిని పిలిచారు. చంద్రబాబు అది కూడా చేయలేదు. బయటవాళ్ళని గృహప్రవేశానికి పిలిస్తే ప్యాలెస్ లోపల విషయాలు బయటకు పొక్కుతాయన్న ఉద్దేశ్యంతో వియ్యంకుడు బాలకృష్ణ కుటుంబాన్ని తప్ప ఇంకొరిని పిలవనే లేదు. సిఎం హోదాలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ కరకట్టపై అక్రమ కట్టడంలోనే సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు కూడా జగన్ ప్యాలెస్ లో తప్ప నివసించలేరని ఎద్దేవా చేయటమే విడ్డూరంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: