పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో..విధ్వంసం!

siri Madhukar
పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. నాలుగు జిల్లాల్లో భయానక వాతావరణం ఏర్పడింది. ఉత్తర 24 పరగణాలు, బుర్ద్వాన్, కూచ్ బిహార్, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో హింస హింస తీవ్రస్థాయిలో ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. 


దాదాపు బెంగాల్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అధికార టీఎంసీ పార్టీ వారు.. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను భయాందోళనకు గురి చేసారు. కర్రలతో దాడి చేయడంతో ఓటర్లు పరుగులు పెట్టారు. ఓ చోట బీజేపీ ఎన్నికల ఏజెంట్ పైన కత్తితో దాడి చేశారు. చాలాచోట్ల విధ్వంసం సృష్టించారు. బీర్బారాలో కర్రలు చేతబట్టుకొని మరీ టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లాలని బెదిరించారు. కొన్ని చోట్ల బాంబులు విసిరారు. నటబరిలో బీజేపీ పోల్ ఏజెంటును టీఎంసీ మంత్రి కొట్టారు. 


పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల్లోనే నాలుగు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.క్షిణ 24 పరంగణాల జిల్లాలో వివిధ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో మీడియా వాహనం ధ్వంసమైంది. సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో ఈవీఎం(ఎల​క్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌)లకు బదులు బ్యాలెట్‌ పేపర్లను ఉపయోగిస్తున్నారు. 


ఈ ఎన్నికల సందర్భంగా సుమారు లక్షా యాభై వేల మంది భద్రతా సిబ్బంది పోలింగ్‌ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 17న వెలుడనున్నాయి. ఇ

వాళ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3,358 గ్రామపంచాయతీల్లోని 48,650 స్థానాలకు 16వేల814 స్థానాల్లో, 341పంచాయతీ సమితిల్లోని 9,217 స్థానాలకు.. 3వేల059 స్థానాల్లో ఎవరూ పోటీచేయడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రస్తుతం 31,827 గ్రామ పంచాయతీల స్థానాలతో పాటు 621 జిల్లా పరిషత్‌లు.. 6,157 పంచాయతీ సమితులకు పోలింగ్ జరుగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: