నేనే మంత్రినైతే.. మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ హాట్ కామెంట్స్..!?

Chakravarthi Kalyan
మాజీ ఐపిఎస్ అదికారి వివి లక్ష్మీనారాయణ ఏపీ రాజకీయ రంగంలోకి దూకారు. అటు మహారాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి ఇచ్చిందో లేదో వెంటనే సభలు ప్రారంభించేశారు. ఇన్నాళ్లూ అధికారిగా సంయమనం పాటించిన ఆయన తొలిసారి మనసులో మాటలు బయటపెట్టారు. 


ఇన్నాళ్లూ ఆయన సామాజిక సేవకు పరిమితం అవుతారా.. లేక రాజకీయాల్లోకి వస్తారా అనే అంశంపై ఊహాగానాలే సాగాయి. ఆయన కూడా ఎంతవరకూ భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం ఆమోద ముద్ర వేశాక చెబుతా అంటూ ఊరిస్తూ వచ్చారు. అలాంటి ఆయన తొలిసమావేశంలోనే కుండబద్దలు కొట్టేశారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నాననని చెప్పకనే చెప్పారు. 


పదవికి రాజీనామా చేసిన తర్వాత మొదటి సారి గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని యాజిలి అనే  గ్రామం వద్ద రైతులతో సమావేశం అయ్యారు. రైతులకు సేవ చేసేందుకే తాను ఐపీఎస్ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. రైతులకు సేవ చేస్తానని, మహారాష్ట్రలో నాసిక్ వద్ద షిండే అనే రైతు ప్రముఖుడు రైతులను సమైక్య పరచి మంచి ఫలితాలు సాధించారని ఉదాహరణలు చూపారు. 


ఐతే.. ఆయన సమావేశంలో ఒక్కసారి.. తాను వ్యవసాయ శాఖ మంత్రిని అయితే అంటూ చేసిన కామెంట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. పదవులపై ఆయనకు ఉన్న ఆసక్తిని బయటపెట్టింది. నేను వ్యవసాయ శాఖ మంత్రినైతే మీకోసం ఏంచేయాలో ఆలోచిస్తున్నా... అంటూ ఆయన ప్రసంగించారు. సో.. ఆయన రాజకీయాలవైపే మొగ్గుతారు.. నో ఛాన్స్.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: