సన్రైజర్స్ ప్రేయర్ నితీష్ రెడ్డి.. ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా?

praveen
ప్రస్తుతం హోరాహోరీగా జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో తెలుగు ప్లేయర్లు కూడా తమ సత్తా ఏంటో నిరూపిస్తూ ఉన్నారు. గతంలోనే ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తిలక్ వర్మ ఇక అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. మరి కొంతమంది తెలుగు ప్లేయర్స్  కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారూ అని చెప్పాలి.

 ఇలా ఆడుతుంది మొదటి ఐపీఎల్ సీజన్ అయినప్పటికీ ఎక్కడ ఒత్తిడి లేకుండా బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తూ బౌలింగ్లో కూడా వికెట్లు పడగొడుతూ  ఆకట్టుకుంటున్న ఆటగాళ్లలో హైదరాబాది ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న   ఈ ఆటగాడు ఇక జట్టు విజయాలలో ఎంత కీలకపాత్ర వహిస్తున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కొత్తగా ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. ఏకంగా స్టార్ బౌలర్ల బౌలింగ్లో సైతం ఉతికి ఆరేస్తూ ఉన్నాడు  ఇక బౌలింగ్లో ఫీలింగ్ లో కూడా ఆకట్టుకుంటున్నాడు.

 దీంతో అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది అని చెప్పాలీ. ఈ క్రమంలోనే ఇలా తన ఆటతో అందరిని ఆకట్టుకుంటున్న ఈ హైదరాబాద్ ప్లేయర్ కు. ఇక టాలీవుడ్ లో ఫేవరెట్ హీరో ఎవరు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పేసాడు నితీష్ కుమార్ రెడ్డి. మా నాన్న సూపర్ స్టార్ కృష్ణ కి పెద్ద అభిమాని. ఇక పోకిరి సినిమా నుంచి నేను మహేష్ ను ఫాలో అవుతున్న. ఆయన చేసే సినిమాలు చాలా స్ఫూర్తిని ఇస్తాయి. ఇక టాలీవుడ్ లో నా ఫేవరెట్ హీరో మహేష్ బాబే అంటూ చెప్పుకొచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: