టూరిస్టుల వాహనానాన్ని చుట్టుముట్టిన చీతాల గుంపు.. చివరికి?

praveen
మనిషి అభివృద్ధి అనే పేరుతో జంతువులన్నింటికీ కూడా ఆవాసమైన అడవులను నాశనం చేస్తూ వచ్చాడు. దీంతో నేటి రోజుల్లో ఇక అడవుల్లో ఉండాల్సిన జంతువులన్నీ కూడా జనావాసాల్లోకి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక నేటి రోజుల్లో జంతువులను చూడాలంటే అటు డిస్కవరీ ఛానల్ లోనో లేకపోతే యానిమల్ ప్లానెట్లోనో చూడాల్సిన పరిస్థితి. ఇక కాస్త డబ్బున్న వాళ్ళు అయితే సఫారీ పార్కులకు వెళ్లి జంతువులను చూడటం చేస్తూ ఉన్నారు. ఇక సఫారీ పార్కుల్లో జంతువులను దగ్గర నుంచి చూడటం అంటే అది ఒక పెద్ద అడ్వెంచర్ లాంటిది అని చెప్పాలీ.

 ఇక చిరుత పులి, సింహం లాంటి ఎన్నో ప్రమాదకరమైన జంతువులు సైతం ఇక పర్యటకులకు ఎంతో దగ్గరగా వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలానే చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన వీడియో చూస్తే వైల్డ్ సఫారీ అనే పదానికి ఇది కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక్కడ కొందరు పర్యాటకులు  కెన్యా వెళ్లారు. అక్కడ వైల్డ్ సఫారిని ఎంచుకున్నారు  అయితే ఫారెస్ట్ గైడ్ తో కలిసి వాహనంలో అడవిలోకి వెళ్లారు. అప్పుడు మొదలైంది అసలు కథ. ఏకంగా చిరుతపులుల గుంపు ఆ వాహనాన్ని చుట్టుముట్టయ్. వాహనంలో గైడ్ తో పాటు ఐదుగురు ఉండగా ఇక దట్టమైన అడవిలో పర్యటిస్తున్న సమయంలో నాలుగైదు జీతాలు వారి వాహనం సమీపానికి వచ్చాయి. ఇక ఆ తర్వాత వారి వాహనం మీదికి ముందు వెనక భాగంలో లోపలికి కూడా వెళ్లాయ్.

 దీంతో ఒక్కసారిగా పర్యటకులందరికీ కూడా ప్రాణాలు అరచేతిలోకి వచ్చినంత పని అయింది. ఏకంగా రెండు చతాలు అటు వాహనం లోపలికి కూడా వచ్చాయి అని చెప్పాలి. అదృష్టవశాత్తు పర్యాటకులను ఆ చీతాలు ఏమీ చేయలేదు. కొద్దిసేపటికి గైడ్ వాహనాన్ని ముందుకు కదల్చడంతో అవి కిందకు దూకాయి. ఇంకా ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇంతకు మించిన అడ్వెంచర్ మరొకటి ఉండదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: