చిట్టి తమ్ముడూ అదికాదు.. ఇది నేర్చుకో.. రేవంత్‌కు మోదీ చురకలు?

Chakravarthi Kalyan
బడే భాయ్, చోటా భాయ్ అనే కామెంట్లు ఇప్పుడు తెలంగాణలో పాపులర్ అయ్యాయి. ప్రధాని మోదీని రేవంత్ బడే భాయ్ అని సంబోధించడమే ఇందుకు కారణం. అయితే తాజాగా ప్రధాని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు.

రేవంత్ నన్ను భడే బాయ్ అని భావిస్తే మంచిదే. ఆయనకు నిజంగా ఆ భావన ఉంటే నా నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నిజాయతీగా ప్రభుత్వాన్ని నడపాలి. సీఎంగా, పీఎంగా సుదీర్ఘకాలం ఈ దేశానికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. నిందలు మోపే ప్రయత్నాలు జరిగినా నాకు ఒక్క అవినీతి మరక కూడా అంటలేదు. నా క్రెడిట్ కొట్టేసేందుకు పెద్దన్న అంటే సరిపోదు. మీరు మంచి చేస్తే ప్రజల నుంచి ఆ పుణ్య ఫలం లభిస్తుంది అని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవినీతిలో కాంగ్రెస్ పార్టీకి గోల్డ్ మెడల్, బీఆర్ఎస్ కు సిల్వర్ మోడల్ అర్హత ఉందని,, ఒకరు విన్నర్ అయితే మరొకరు రన్నరఫ్ అని ఎద్దేవా చేశారు. కానీ తెలంగాణలో ప్రస్తుతం కమీషన్లు తీసుకోవడతో ఏమీ మిగలడం లేదన్నారు. తెలంగాణను ఆర్ ఆర్ ట్యాక్స్ సర్వనాశనం చేస్తోందని విమర్శించారు. అవినీతి విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి నన్ను బడే భాయ్ అని పిలవడం సంతోషకరం. కానీ పెద్దల నుంచి చిన్నవాళ్లు మంచి విషయాలు నేర్చుకోవాలి కదా. సీఎంగా, పీఎంగా అందరికంటే ఎక్కువ కాలం ఒక్క మచ్చా లేకుండా పనిచేశా. దీనిని తమ్ముడి నేర్చుకోవాలి అని సూచించారు. అన్ని చోట్లా పెద్దన్నా.. పెద్దన్నా అని వెంటపడితే కుదరదు అంటూ వ్యంగస్త్రాలు సంధించారు. ప్రభుత్వం ప్రభుత్వమే.. వ్యక్తిగతం వ్యక్తిగతమే అని కుండ బద్దలు కొట్టారు. మరి మోదీ రియాక్షన్‌ పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: