మోడీ: ఎవడ్రా ఆ మాట అంటోంది.. ఇంత చిన్న లాజిక్‌ ఎలా మిస్సయ్యారు?

Chakravarthi Kalyan
ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తపిస్తున్నారు మోదీ-షాలు. పదేళ్ల తమ పాలనకు బహుమతిగా 400కి పైగా సీట్లు మెజార్టీని ఇవ్వాలని కోరుతున్నారు. మరోసారి ఈసారి మోదీ సర్కారు ఏర్పడితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని.. రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

మోదీ గెలుపుతో దేశం ప్రమాదంలో పడుతుందన్న వాదనను పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. విపక్షాలకు తోడుగా వామపక్షాలు సైతం ఇదే బాణీని అందుకున్నాయి. మేధావుల్లోను ఒక సెక్షన్ మోదీ సర్కారు కు ఎట్టి పరిస్థితుల్లోను 300 సీట్లు దాటకూడదని కోరుకుంటున్నారు. విజయాన్ని ఆపడం సాధ్యం కాకపోయినా కనీసం మెజార్టీని 300లోపు పరిమితం చేయాలని.. తద్వారా కేంద్రానికి ముకుతాడు వేయోచ్చని వివరిస్తున్నారు. ఇలాంటి వేళ మోదీ సర్కారు కొలువు తీరితే ఏం జరుగుతుంది. రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అసలు బీజేపీ వాదన ఏంటి? కాంగర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత. రాజ్యాంగాన్ని నిజంగా రద్దు చేస్తారా వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేశారు ప్రధాని మోదీ.

ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటి గురించి ఓ స్పష్టత ఇచ్చేశారు. ప్రస్తుతం మా దగ్గర అంటే ఎన్డీయే కూటమిలో 360 సీట్లు ఉన్నాయి. ఎన్డీయేలో లేకున్నా బీజేడీతో పాటు మిగతా పార్టీల మద్దతు మాకు ఉంది. ఆ లెక్కలు చూసుకుంటే మా దగ్గర మొత్తం 400 సీట్లు ఉన్నట్టే. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్నాం.

అలాంటి పాపం చేయాలంటే మేం ఎప్పుడో చేసేవాళ్లం. ఇది తర్కం కాదు. సత్యం కాదు. ప్రతపక్షాల చరిత్ర చూడండి. సొంత పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించలేని కాంగ్రెస్.. దేశ రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తుంది అని ప్రశ్నించారు. ప్రస్తుతం వారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లభించే రిజర్వేషన్లు ఎలా లాక్కోవాలి అని చూస్తున్నారు. మొత్తంగా రాజ్యాంగాన్ని రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని.. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని తేల్చిచెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: