ఏపీ: చంద్రబాబు మౌనం వెనుక ఇంత నిజం దాగి ఉందా.?

Pandrala Sravanthi
మౌనమేలనోయి ఇవి మరపురాని ఎలక్షన్స్ ఓయి...గెలుపు ఎవరిదోయి.. అంతర్మాతనమెందుకోయి, నోరు విప్పి మాట్లాడోయ్ అంటూ చంద్రబాబుపై  వైసిపి నాయకులు, వైసీపీ అభిమానులు పాటలు పాడుతున్నారు. ఇదే తరుణంలో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం తన గెలుపు తద్యమని బాహాటంగానే చెప్పారు. కానీ ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు కానీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గానీ, పవన్ కళ్యాణ్ గానీ ఎవరూ కూడా  వారి యొక్క గెలుపు ఓటములపై మౌనం వీడడం లేదు. దీంతో టిడిపి క్యాడర్ లో తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది. 

గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు తప్పనిసరిగా మీడియా సమావేశంలో స్పందించి తన గెలుపు పై ధీమా వ్యక్తం చేసేవారు. ఈసారి పరిస్థితులన్నీ మారిపోయాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్ గా ఎవరికీ తెలియకుండా విదేశాల్లోకి వెళ్లిపోయారు. ఇక ఇక్కడే ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కూడా కనీసం నోట్లో నుంచి ఒక్క మాట కూడా మీడియా ముందు బయట పెట్టడం లేదు. ఇక కింది స్థాయి వర్గం నాయకులు కూడా ఎక్కడా కూడా వారి పార్టీ గెలుస్తుందని గట్టిగా చెప్పడం లేదు.  కానీ చంద్రబాబు మాత్రం పులి సైలెంట్ గా ఉండి పంజా ఎలా విసురుతుందో, ఆ విధంగానే తన గెలుపును  చూపించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

  అందుకే ఆయన అంత సైలెంట్ అయిపోయారని, ఇప్పటికే ఆయన ఎన్నో సర్వేలు కూడా చేయించుకున్నారని ,  అసలు నిజం ఏంటనేది చంద్రబాబు మదిలోనే దాగి ఉన్నదని సమాచారం. ఇదే తరుణంలో వైసిపి క్యాడర్ లో మాత్రం కాస్త ఆనంద ఉత్సాహాలు నెలకొన్నాయని చెప్పవచ్చు.  ఎందుకంటే వైసిపి బాస్ జగన్మోహన్ రెడ్డి 151 అసెంబ్లీ 22 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తామని బాహాటంగానే చెప్పారు.  ఇదే తరుణంలో ఓవైపు సర్వే సంస్థల వాళ్ళు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎవరిది విజయమని చెప్పలేకపోతున్నారు. అలాగే  బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగులు వేస్తూ రెచ్చిపోతున్నారు. ఈ విధంగా ఏపీలో ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా సాగాయని చెప్పవచ్చు. మరి ఈ ఉత్కంఠకు తెరపడాలి అంటే జూన్ 4 వరకు తప్పనిసరిగా వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: