జూన్ 4 తర్వాత బీజేపీకి చంద్రబాబే దిక్కు..?

Suma Kallamadi
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 2024 పార్లమెంటు ఎన్నికలలో భాగంగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నామినేషన్ వేసేటప్పుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోదీ వెంటే ఉన్నారు. ఈ సమయంలో మోదీకి పక్కనే ఉండేందుకు ఆయన ప్రత్యేకంగా వారణాసికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌తో పాటు ఎంపిక చేసిన కొద్దిమంది అతిధులలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం.
ఇంకో విశేషమేంటంటే, ఈ కార్యక్రమంలో బీజేపీ చంద్రబాబుకు అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. తమకు బాగా కావాల్సిన నేతగా ఆయన్ను ట్రీట్ చేసింది. బీజేపీ పెద్దలతో కలిసి కూర్చున్న చంద్రబాబు ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. బీజేపీ పెద్దలతో కలిసి కూర్చోవడం చూస్తుంటే బీజేపీ చంద్రబాబు మాత్రమే దిక్కు అని భావిస్తుందేమో అనిపిస్తోంది. చంద్రబాబు తమ పార్టీలో చేరడం వల్ల తమకు ప్రయోజనం చేకూరినట్లు వారి ఫీలవుతున్నారు అని తెలుస్తోంది.
బీజేపీ కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా సపోర్టు ఇస్తుందని, ఎంపీ సీట్లు తగ్గిన వెంటనే కవర్ చేస్తుందని  బిజెపి అధినాయకులు అనుకుంటున్నారు. చంద్రబాబు గెలుస్తారనే నమ్మకంతో వారు ఉన్నారు ఆయన గెలిస్తే ఆయన సీట్లు వీళ్లకి అవసరమవుతాయి. ఆ అవసరం ఉంది కాబట్టే బాబుగారిని బాగా ట్రీట్ చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  మోడీ, అమిత్ షా, జెపి నడ్డా, ఇతరులతో సహా బీజేపీకి చెందిన కొంతమంది పెద్ద నేతలలో ఒకరిగా చంద్రబాబు ఫోటోలో కూర్చున్నారు.
 ప్రస్తుతానికి చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటిషన్, కష్టపడి పని చేసే నాయకుడు తమకు అత్యవసరమని  బీజేపీ అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. 44 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు కేంద్రంలో గెలిచేందుకు కేంద్రంలో మంచిగా పనిచేసేందుకు ఆయన వ్యూహాలను వినిపించవచ్చు. ఎంతసేపు మతాన్ని సెంటిమెంట్ గా చూపి ఓట్లను పొందడం కష్టమని అమిత్ షా, మోదీకి కూడా అర్థమైంది. అందుకే కొత్త రాజకీయ వ్యూహాల  కోసం చంద్రబాబును మచ్చిక చేసుకుంటున్నట్లు అర్థమవుతుంది. జగన్ మంచి నాయకుడే కానీ రాజకీయంగా ఆయనకు పెద్దగా తెలిసింది ఏమీ లేదు. ఇకపోతే మొత్తం మీద వారణాసిలో చంద్రబాబుకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వెనుక దాగి ఉన్న ఎజెండా ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: