ఏపీ : పిన్నెల్లికీ షాక్ ఇచ్చిన హైకోర్టు..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి పోలింగ్ భారీగా జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి యువత భారీగా పోలింగ్ లో పాల్గొన్నారు. అలాగే మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు కూడా పోలింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనితో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. అయితే ఈ సారి ఎన్నికలు కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలలో తప్ప మిగిలిగిన అన్నీ చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సమస్యాత్మక నియోజకవర్గాలు అయిన పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, గురజాలలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. పోలింగ్ ముగిసాక కూడా గొడవలు జరగడంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం జరిగింది.ఇదిలా ఉంటే మాచర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవిఎం పగలగొట్టిన వీడియో టీడీపీ రిలీజ్ చేయగా పిన్నెల్లిపై ఈసీ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 

ఈవీఎం మిషన్ ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి  హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది..కౌంటింగ్ రోజున మాచర్ల వెళ్లొద్దని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారిచేసింది. పిన్నెల్లిని పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోనే వచ్చే నెల 6 వరకు ఉండాలని హైకోర్టు ఆదేశించింది.. కౌంటింగ్ కేంద్రానికి హాజరయ్యేందుకు మాత్రమే పిన్నెల్లికీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే ఈ కేసు విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడ కూడదని పిన్నెల్లిని ఆదేశించింది.. ఈ ఘటనకు సంబంధించి సాక్షులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయకూడదని హైకోర్ట్ ఆదేశించింది.. పిన్నెల్లి పై పూర్తి స్థాయి నిఘా విధించాలని సీఈఓ, పోలీసు అధికారులుకు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్ట్ ఆదేశించింది.అలాగే జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే హై కోర్ట్ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: