ఏపీ: అనకాపల్లి వాసులకు సీఎం రమేష్ ఒక పెద్ద వరం..??

Suma Kallamadi
అనకాపల్లిలో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రజలకు ఒక గొప్ప వరం, బహుమతిగా నిలుస్తారని అనడంలో సందేహం లేదు. ఎందుకంటే సీఎం రమేష్ కు బీజేపీ దిగ్గజ నేతలైన మోదీ, అమిత్‌ షాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. బీజేపీ జాతీయస్థాయిలో ఆయనకు ఉన్న కాంటాక్ట్స్ ఏ టీడీపీ నేతకు లేవని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు, మోదీ మధ్య సమావేశం ఏర్పాటు చేయించేంత పలుకుబడి కూడా ఆయన సొంతం. దానికి సాక్ష్యం మోదీ అనకాపల్లిలో సభ ఏర్పాటు చేయడమే అని చెప్పుకోవచ్చు.
సీఎం రమేష్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టే మోదీ ఈ నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. మోదీ ఒక్కరే కాదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి కేంద్ర మంత్రులు ఎవరు ఏపీకి వచ్చినా అనకాపల్లిలో సమావేశం పెట్టకుండా వెళ్లడం లేదు. కారణంగా వైజాగ్ నగరంలో సమావేశాలు పెట్టేవారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న మీటింగ్ తప్ప మిగతావన్నీ అనకాపల్లి కే షిఫ్ట్ చేసుకుంటున్నారు.
అనకాపల్లి ప్రజలను ఆకర్షించే ఏంటి సీఎం రమేష్ ను గెలిపించుకోవాలనే వీరు తాపత్రయపడుతున్నారు. వీటి ద్వారా తనకు ఎంత పలుకుబడి ఉందో సీఎం రమేష్ నిరూపిస్తున్నారు. సీఎం రమేష్ అనకాపల్లిలో గెలిస్తే ప్రజలకు చాలా మంచివి జరుగుతుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఈయన గెలిస్తే కేంద్రం సహాయంతో అనకాపల్లిలో అనేక అభివృద్ధి పనులు చేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో క్లీన్ స్వీట్ చేయాలని చూస్తోంది కానీ సీఎం రమేష్ టీజీ భరత్ లాంటి అభ్యర్థులను ఓడించడం స్పష్టమని అర్థమవుతోంది. వైసీపీ ఈసారి గెలుస్తుందని అంటున్నారు. కానీ మెజారిటీ తగ్గే అవకాశం కచ్చితంగా ఉండనుంది. కూటమి గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదని మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా పోలింగ్ తేదీకి పది రోజుల సమయం కూడా లేదు. నెల రోజుల్లోనే కౌంటింగ్ కూడా వెలువడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: