ఛీ..ఛీ.. ఆ కేసీఆర్‌ను గడప కూడా తొక్కినివ్వను.. మోదీ ఫైర్‌?

Chakravarthi Kalyan
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్లు ఉంది కేసీఆర్ పరిస్థితి. తెలంగాణ కు సీఎంగా ఉన్న  సమయంలో కేంద్రంలోను తాము చక్రం తిప్పుతామని.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని పెద్ద పెద్ద పగటి కలలే కన్నారు. అధికారం అండగా ఉండటంతో.. వేలాది కార్లు, కాన్వాయ్ లతో మహారాష్ట్ర, ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఒడిశా, కర్ణాటక, దిల్లీ తదితర రాష్ట్రాల పర్యటనకు వెళ్లారు.

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో పాటు తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకచోట కేసీఆర్ పరాజయం పాలయ్యారు. దేశంలో పోటీ ఏమో కానీ.. తెలంగాణలో 17 సీట్లలో కూడా అభ్యర్థుల కరవయ్యారు.  ఇప్పుడు ఏమో తెలంగాణ  లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేది బీఆర్ఎస్సే నని.. మా పార్టీ లేని కేంద్రం ఉండదని భారీ ప్రకటనలే చేస్తున్నారు.

కేంద్రంలో సంకీర్ణం ఖాయమని.. బీఆర్ఎస్ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని జోస్యాలు చెబుతున్నారు. అయితే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. అలాంటి అవసరమే వస్తే కేసీఆర్ ను ఎన్డీయే కూటమిలో చేర్చుకుంటారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. మేం  మా కూటమిలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టారు.

ఆయన ఎప్పుడూ ఇలాంటి అబద్ధాలే చెబుతారు అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చి ఎన్డీయేలో చేరతామని అన్నారు. మేం విపక్షంలో అయిన కూర్చుంటాం.. అక్కడి నుంచే పోరాడుతాం తప్ప కూటమిలో చేర్చుకోం అని చెప్పామన్నారు. మరోవైపు ఇండియా కూటమిలోకి కూడా కేసీఆర్ ను చేర్చుకునే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి నిర్మొహమాటంగా చెప్పేశారు. దీంతో అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి.. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిలోకి చేరుందుకు బీఆర్ఎస్ కు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ పేరుతో వచ్చినా కేసీఆర్ ను పట్టించుకునే నాథుడే ఉండరు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: