ఎస్పీవై రెడ్డి తగ్గే సమస్యే లేదట ..

KSK

రాయలసీమ రాజకీయాలలో ఎస్పీవై రెడ్డి చాలా ప్రముఖుడు. నంద్యాల ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాటకు కట్టుబడి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిన భూమా బ్రహ్మానంద రెడ్డికి అండగా వుండి టిడిపి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో నంద్యాల పై కన్నేశాడు ఎస్పీవై రెడ్డి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పార్లమెంటు సీటును తమ కుటుంబానికి ఇవ్వాలని చంద్రబాబుకి సంకేతాలు ఇచ్చారట.


అయితే ఎస్పీవై రెడ్డి ఇంతగా పట్టుబడడానికి అసలు కారణం ఏమిటి అని వివరాల్లోకి వెళితే...గత ఉప ఎన్నికలలో భూమా కుటుంబానికి మద్దతుగా నిలిచిన ఎస్పీవై రెడ్డి కుటుంబం. ఆ తర్వాత జరిగిన  కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా డిప్యూటీ సీఎం సోదరుడు మాజీమంత్రి కేఈ ప్రభాకర్ ను అభ్యర్థి గా ప్రకటించారు.


కనీసం ఈ ఎమ్మెల్సీ అయినా వస్తుందనుకున్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి సీటు కేటాయించారు. అంతేకాకుండా పోటీ ఏకగ్రీవం చేసుకోగలిగారు. దీంతో వున్న ఒక్క సీటును అల్లుడి కి ఇప్పించలేక పోయాను అని ఎస్పీవై రెడ్డి బాధపడుతూ…ఈసారి ఎలాగైనా వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ పార్లమెంటు సీటును తమ కుటుంబానికే ఇవ్వాలంటు తాను పట్టు వీడను అని పట్టుబట్టుకు కూర్చున్నాడు.


అయితే ఇక్కడ నంద్యాల అలగడ్డ రెండు ప్రాంతాలలో భూమా కుటుంబానికి చాలా ఓటు బ్యాంకు ఉంది...మరి ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి కోసం భూమా అఖిల ప్రియ సీటు వదులుకుంటుందా లేదో చూడాలి మరి.  అలాగే ఈ వ్యవహారంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: