స్త్రీలు మాట వినకపోతే.. గాడిదలతో రేప్..!?

Chakravarthi Kalyan
అనాదిగా స్త్రీలు అణచివేయబడ్డారన్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని వందల ఏళ్ల క్రితం వరకూ స్త్రీలు కేవలం పురుషుడి ఆస్తిగానే పరిగణించేవారు. శారీరకంగా, మానసికంగా స్త్రీ అణచివేతకు దోపిడీకి గురైంది. 21వ శతాబ్దంలోనూ స్త్రీ అనేక సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. కానీ ఒక్కసారి గతంలోకి వెళ్తే.. స్త్రీలను ఎంతగా వంచనకు గురి చేశారో తెలిస్తే.. గుండె బరువెక్కక మానదు. 


అలాంటి చరిత్రలోని చీకటి కోణాలను వెలికి తీసే ఓ చారిత్రక ఆధారాలు.. ఇప్పుడు మహారాష్ట్రలో విస్తుగొలుపుతున్నాయి.  పదో దశాబ్దంలో స్త్రీని కట్టడి చేయడానికి, తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు.. భయపెట్టేందుకు అత్యంత అనాగరికమైన పద్దతులు అనుసరిస్తున్నాయని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అప్పట్లో మహిళలు తప్పు చేస్తే జంతువులతో అత్యాచారం చేయించేవారని ఆ ఆధారాలు చెబుతుండటం విశేషం. 


ముంబయికి చెందిన హర్షదా విర్కుద్ అనే మహిళ పదో శతాబ్దాం నాటి మహిళల పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా మహారాష్ట్రలోని పలు దేవాలయాల్లోని శాసనాలను, శిల్పాలపై అనేక పరిశోధనలు జరిపారు. అక్కడి అనేక శిల్పాలపై మహిళలను అత్యాచారం చేస్తున్న పశువులు బొమ్మలు లభించాయట. అప్పట్లో రాజులు మహిళలను భయపెట్టేందుకు ఇలాంటి నియమాలు పెట్టేవారట. 


ఇలాంటి శాసనాలు, శిల్పాలు మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో 150పైగానే వెలుగు చూశాయట. ఇవి కేవలం నియమ నిబంధనలను తెలిపేవేనా.. లేక నిజంగానే ఈ శిక్షలు అమలయ్యాయా అనే అంశాలపై ఇంకా క్లారిటీ రావల్సి ఉందట. ఇలాంటి కఠినమైన నియమాలు రూపొందించడం వల్ల స్త్రీలు అదుపు ఆజ్ఞలలో ఉండేవారిని.. పురుషులు కూడా వారిని అదుపుఆజ్ఞల్లో ఉంచేవారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: