చిన్నమ్మ ప్లాన్ చూస్తే..దిమ్మతిరగాల్సిందే..!

Edari Rama Krishna
గత కొంత కాలంగా తమిళనాడు రాజకీయల్లో జరుగుతున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడు సీఎం పీఠంపై దక్కించుకునేందుకు పన్నీరు సెల్వం, శశికళ మద్య పెద్ద యుద్దమే అయ్యింది.  అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం తన పదవికి రాజీనామా చేసి తర్వాత చిన్నమ్మపై తిరుగుబాటు చేశాడు. దీంతో సీఎం పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శశికళ ఒక్కసారే షాక్ కి గురికావడం..వెంటనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను  గోల్డెన్ బే రిసార్ట్‌ తీసుకు వెళ్లి అక్కడ నుంచి పావులు కదిపింది.  అయితే అక్రమాస్తుల కేసులో చిన్నమ్మకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది సుప్రీం కోర్టు.  

తను కోరుకున్న పదవి దక్కలేదన్న బాధ ఓ వైపు..పన్నీరు సెల్వాన్ని సీఎం కాకుండా చేయాలనే కక్ష్య మరోవైపు ఉంటంతో..తెరపైకి పళని స్వామిని తీసుకు వచ్చింది చిన్నమ్మ.  ఇక పళని స్వామిని అన్నాడీఎంకే సభాపక్ష నేతగా ఎన్నుకోవడం..వెంటనే గవర్నర్ ని కలవడం..సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి.  శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షలో గెలుపొందిన పళని స్వామి ప్రస్తుతం తమిళనాడు సీఎం గా కొనసాగుతున్నారు.  ఇప్పుడు  కర్నాటక జైలు నుంచి తమిళనాడు జైలుకు మారాలన్న శశికళ ప్రయత్నాలు ముమ్మరమమ్యాయి. అంతే కాదు జైలు మార్పు కోసం ఆమె లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్లు వేయనున్నట్లు సమాచారం.

తమిళనాడు జైలుకు వెళితే అక్కడినుంచే పాలనను శాసించవచ్చునని చిన్నమ్మ వ్యూహం. సుప్రీం అయితేనే జైలు మార్పిడికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఆరోగ్యంతో పాటు భద్రత కారణాలను కూడా పిటిషన్ లో ప్రస్తావిస్తూ వేలూరు లేదా చెన్నై జైలుకు మార్చాలని కోరనున్నట్లు సమాచారం అందుతోంది. నేడు లేదా రేపు ఈ పిటిషన్ సుప్రీంకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: