కేటీఆర్ భాయ్ జర కేసు మాఫ్ కరో భాయ్...!!

Shyam Rao
ఓటుకు నోటు కేసు తెలుగు దేశం పార్టీని ఎంత కలవరపెట్టిందో మనందరికీ తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే  స్టీఫెన్ సన్ కి లంచం ఇవ్వజూపిన సమయంలో తీసిన వీడియో ఆధారంగా రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి దొరికిపోయారు. ఆ తర్వాత రేవంత్ అరెస్ట్ కావడం, ఆయన్ని జైలుకు పంపడం, కొన్ని రోజుల తర్వాత ఆయన్ని బెయిల్ పై విడుదలజేయడం జరిగిపోయాయి. 



అయితే ఈ కేసులో కీలక సూత్రధారి అయిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హస్తం ఉందని తేలడంతో బాబు ఒక్కసారిగా షాక్ కు గురవ్వడం, ఆ తర్వాత కేంద్రం కాళ్లా వెళ్లా పడి ఏదో విధంగా బయటపడడం జరిగింది. అయితే ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ కి అప్పగించిన నేపథ్యంలో పదకొండు నెలల తర్వాత ఈ కేసు మళ్లీ విచారణలోకి వచ్చింది. పైనున్న ఫోటో ను ఒక్కసారి గమనించినట్లైతే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తనను ఈ కేసునుంచి గట్టెక్కించాలని కోరుతున్నట్లు,



దానికి ఆయన ససేమిరా అని చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదని చెబుతున్నట్లు పై ఫోటోను చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది. ఈవ్యవహారంలో గత ఏడాది జూలై 28న నలుగురు నిందితులపై ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసింది. దాదాపు 14 నెలలుగా ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదు. ఇక మూసేసిన దశలో ఉన్న ఈ కేసును వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుతో మళ్లీ దర్యాప్తు చేయాల్సి వస్తోంది. ఈ కుట్రలో చంద్రబాబునాయుడు పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో...ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఏసీబీని ఆదేశించింది. 



కోర్టు ఆదేశాల నేపథ్యంలో..14 నెలలుగా మూలనపడేసిన ఈ కేసులో ఏసీబీ అనివార్యంగా దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ వాయిస్ చంద్రబాబునాయుడిదేనని ముంబాయికి చెందిన ఫోరెన్సిక్ సంస్థ నిర్ధారించిన నేపథ్యంలో ఈ కుట్రలో ఆయన పాత్ర స్పష్టమైంది. ఈ కేసులో పాలుపంచుకున్న కుట్రదారులందరిపైనా దర్యాప్తు సాగుతోందని, వారి పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని మెమోలో వివరించింది. రేవంత్‌రెడ్డి, హ్యారీ సెబాస్టియన్, ఉదయ్ సింహల పాత్రకు సంబంధించిన ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేశామని పేర్కొంది.



అలాగే వీరి స్వర నమూనాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామని, వారిచ్చిన నివేదిక ఆధారంగా ఈ చార్జిషీట్ దాఖలు చేశామని మెమోలో వివరించారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు (సీసీ నెంబర్ 15/2016...కాగ్నిజెన్స్) స్వీకరించింది. ఈ చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న రేవంత్‌రెడ్డి, హ్యారీ సెబాస్టియన్, ఉదయ్ సింహలకు కోర్టు సమన్లు జారీచేసింది. సెప్టెంబర్ 29న ప్రత్యక్షంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి విక్టర్ ఇమాన్యూయేల్ బుధవారం ఆదేశాలు జారీచేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: