ఆ తెలుగోడు.. నన్ను ఫిదా చేసేసాడు : వాట్సన్

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా కూడా ఒక యువ ఆటగాడు గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఆ యువ ఆటగాడు ఎవరో కాదు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు తన బ్యాటింగ్తో అందరిని ఫిదా చేసేస్తున్నాడు. ఇక క్రికెట్ లవర్స్ అందరిని కూడా తన అభిమానులుగా మార్చేసుకుంటున్నాడు. కేవలం ప్రేక్షకులను మాత్రమే కాదు మాజీ ఆటగాళ్లను సైతం తన బ్యాటింగ్ తో మంత్రముగ్ధుల్ని చేసేస్తూ ఉన్నాడు.

 ఇంకా పాతీకెళ్ళు కూడా నిండని తెలుగోడు.. అంతర్జాతీయ క్రికెట్లో అపారమైన అనుభవం ఉన్నట్లుగానే బాటింగ్ చేస్తున్నాడు. ఎంతో అనుభవం ఉన్న స్టార్ బౌలర్ల బౌలింగ్లో సైతం చితక్కొట్టుడు కొట్టేస్తున్నాడు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా స్టార్ స్పిన్నర్లు చాహల్, అశ్విన్ బౌలింగ్లలో కూడా అతను అద్భుతంగా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పాలీ. అయితే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి ఇక సన్రైజర్స్ కు గౌరవప్రదమైన స్కోర్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.

 ఒక రకంగా టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ విజయం సాధించింది అంటే అందులో అటు నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది అని చెప్పాలి. అతని బ్యాటింగ్ పై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షైన్ వాట్సన్ నితీష్ రెడ్డి పై ప్రశంసలు కురిపించాడు. టోర్నమెంట్లో అతను తన ఫేవరెట్ గా ఆటగాడిగా మారుతున్నాడు అంటూ వాట్సన్ చెప్పుకొచ్చాడు. ఇంత చిన్న వయసులో ఒత్తిడిలో కూడా చాహల్, అశ్విన్ లాంటి బౌలింగ్లో అంత దూకుడుగా ఆడటం మామూలు విషయం కాదు. ఇటీవల ఇన్నింగ్స్ లో నితీష్ ఎంతో నాణ్యమైన షాట్స్ ఆడాడు. అందుకే అతను ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు అంటూ ప్రశంసలు కురిపించాడు వాట్సన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: