అమరావతి సంపద.. ఆంధ్రా ఆశలు గల్లంతేనా..!?

Chakravarthi Kalyan
ఆంధ్రుల రాజధాని అమరావతికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అమరావతి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు దేశ దేశాలు దాటి విదేశాలకు కూడా వెళ్లాయి. లండన్ మ్యూజియంలో ఏకంగా అమరావతి పేరుతో ఓ విభాగమే ఉంది. ఇప్పుడు ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన తర్వాత వీటన్నింటినీ ఏపీకి తీసుకురావాలన్న వాదనలు పెరిగాయి. 

ఏపీ సీఎం చంద్రబాబు కూడా అమరావతి శిల్ప సంపదను, చరిత్ర గుర్తులను ఏపీకి తీసుకువచ్చి ఓ ప్రత్యేక మ్యూజియం నిర్మిస్తామని పలుసార్లు ప్రకటించారు. అందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. కానీ అవి అంతగా సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదట. అమరావతికి సంబంధించిన శిల్ప సంపద, చరిత్ర గుర్తులు తెలంగాణలో ని స్టేట్‌ మ్యూజియంతోపాటు తమిళనాడులోని ఎగ్మోర్‌ మ్యూజియం, కోల్‌కతా, ఢిల్లీ, లండన్‌ మ్యూజియంలలో ఉన్నాయి. 

అమరావతి శిల్పాలు..ఇప్పట్లో రావా..!?


అమరావతి చరిత్ర గుర్తులు తమకు ఇవ్వాల్సిందిగా ఏపీ సర్కారు చేసిన విజ్ఞప్తులను ఢిల్లీ, కోల్‌కతా మ్యూజియాలు అస్సలు పట్టించుకోనే లేదట. ఇక చెన్నైలోని ఎగ్మోర్‌ మ్యూజియం అధికారులు మాత్రం .. అమరావతి శిల్పాలను పరిరక్షించటానికి రూ.కోట్లు ఖర్చుపెట్టాం.. కదిలించటానికి వీలు లేని విధంగా శాశ్వతంగా చాలా శిల్పాలను ఫిక్స్‌ చేశాం. వీటిని తరలించడం చాలా కష్టం.. వీటిని ఇక్కడ ఉంచటమే మంచిదంటూ తిరిగి ఉత్తరం రాశారు. 

ఇక లండన్ మ్యూజియం వాళ్లయితే.. అమరావతి శిల్పాలను తిరిగి ఇచ్చే షరతులతోనే ఇస్తాం.. అందులోనూ అన్నింటినీ ఇవ్వం.. కొన్ని శిల్పాలను 5-10 ఏళ్లు ఏపీలో ఉంచి తిరిగి మాకు అప్పగించాలని కండీషన్లు పెడుతున్నారు. ఒకవేళ వీటిని ఏపీకి తీసుకొచ్చినా.. వాటిని సంరక్షించడం చాలా కష్టమైన పనిగా చెబుతున్నారు. నెలకు లక్షల్లో ఖర్చుపెట్టి లండన నుంచి నిపుణులను తీసుకురావాల్సిఉంటుందట. సో..అమరావతి శిల్పాలు ఇప్పట్లో ఏపీకి రావన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: