విడాకుల వార్తలపై గట్టిగా స్పందించిన... ఆమని..!

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన వారిలో ఆమని ఒకరు. ఈమె 1990 లలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న చాలా మంది పక్కన నటించి ఎన్నో విజయాలను అందుకొని ఆ సమయంలో అద్భుతమైన స్థాయిలో కెరియర్ ను కొనసాగించింది. ఈమె ఆ సమయంలో ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో నటించి తన నటనతో , పాటు అందాలతో కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

దానితో ఈ బ్యూటీ కి ఆ సమయంలో యూత్ అభిమానుల్లో ఎక్కువ క్రేజ్ ఉంది. అలా చాలా సంవత్సరాల పాటు కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు కొనసాగించిన ఈమె కొన్ని సంవత్సరాల క్రితం తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాత అయినటువంటి ఖాజా మొహీయుద్దీన్ ను వివాహం చేసుకుంది. ఇక వీరికి ఒక బాబు మరియు ఒక పాప కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమని మళ్లీ కొన్ని సంవత్సరాల నుండి వరుస సినిమాల్లో , సీరియల్ లలో కూడా నటిస్తుంది.

ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈమె తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ వార్తలపై తాజాగా ఆమని స్పందించింది. తాజాగా విడాకుల వార్తలపై ఆమని స్పందిస్తూ ... ప్రస్తుతం తాను మరియు తన భర్త ఇద్దరం వేరు వేరుగా ఉంటున్నాం అది వాస్తవం. కానీ మేము ఇంకా విడాకులు మాత్రం తీసుకోలేదు అని ఈమె స్పష్టం చేసింది. ఇలా తాజాగా ఆమె విడాకుల వార్తలపై వస్తున్న గాసిప్స్ కి ఆమని పులిస్టాప్ పెట్టేసింది. ఇకపోతే ప్రస్తుతం ఆమెని సినిమాలతో పాటు సీరియల్ లో కూడా నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: