' గౌతు ' రాజ‌కీయ వార‌స‌త్వం నిల‌బ‌డేనా.. ' శిరీష ' అసెంట్లీ ఎంట్రీ ఇచ్చేనా.. !

RAMAKRISHNA S.S.
- గౌతు శిరీష‌పై బీసీ, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ఆశ‌లు
- ఈ ఎన్నిక‌ల్లో గెలుపు అతి పెద్ద స‌వాల్‌
( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
స్వాతంత్ర పోరాటంతో మొదలుపెట్టి తెలుగు గడ్డపై తెలుగు రాజకీయాల్లో ఎంతో చెరగని ముద్ర వేసిన కుటుంబం గౌతు కుటుంబం.. బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడు, ఆశాజ్యోతి అయిన దివంగత సర్దార్ గౌతు లచ్చన్న.. తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చెక్కుచెదరని స్థానం సొంతం చేసుకున్నారు. ఐదు సార్లు అసెంబ్లీకి.. ఒకసారి శ్రీకాకుళం పార్లమెంటుకు గెలిచిన గౌతు లచ్చన్న.. బడుగు బలహీన వర్గాలలో సామాజిక రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తి అని నిస్సందేహంగా చెప్పాలి.

లచ్చన్న తన రాజకీయ గురువు అయిన ఆచార్య ఎన్జీరంగా.. గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోతే.. అలాంటి వ్యక్తి పార్లమెంట్‌లో ఉండాలని శ్రీకాకుళంలో తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసి తన గురువు అయిన రంగాను అక్కడి నుంచి పోటీ చేయించి.. గెలిపించుకుని పార్లమెంటులోకి పంపారు. గౌతు లచ్చన్న రాజకీయ వారసుడుగా ఆయన కుమారుడు గౌత శివాజీ తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రద్దయిన సోంపేట నుంచి నాలుగు సార్లు, పలాస నుంచి ఒకసారి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

1989లో శివాజీకి ఎన్టీఆర్ అనివార్య కారణాలవల్ల టికెట్ ఇవ్వలేకపోయారు. అయినా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికై సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశారు. గౌతు కుటుంబం మొత్తం పదిసార్లు అసెంబ్లీకి.. ఒకసారి పార్లమెంటుకు వెళ్ళింది. ల‌చ్చ‌న్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఓ సారి ఎంపీగా గెలిస్తే.. ఆయ‌న త‌న‌యుడు శివాజీ గారు ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2019 ఎన్నిక‌ల వేళ శివాజీ రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్పేశారు. ఇదే కుటుంబంలో మూడో తరం రాజకీయ వారసురాలిగా శివాజీ కుమార్తె గౌతు శిరీష ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికలలో పలాస నుంచి పోటీ చేసిన ఆమె గట్టి పోటీ మధ్యలో ఓడిపోయారు.

మూడో త‌రంలో శిరీష మీద పెద్ద బాధ్య‌త :
ఆరేడు ద‌శాబ్దాల బ‌ల‌మైన రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కంటిన్యూ చేయ‌డం.. అందులోనూ ఓ మ‌హిళ‌గా అంటే మామూలు విష‌యం కాదు. ఇప్పుడు శిరిష మీద పెద్ద బాధ్య‌తే ఉంది. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం.. చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఆమె ముందున్న పెద్ద స‌వాల్‌. అలాగే గెలిచాక కూడా ఆమె కొన్నేళ్ల పాటు రాజ‌కీయాల్లో బీసీల గొంతుక వినిపించే మ‌హిళా నేత‌గా నిల‌బడాల్సి ఉంది. శిరీష ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్ రాజ‌కీయ యువ‌నిక‌పై వ‌చ్చే కొన్నేళ్ల‌లో పోషించే పాత్ర కోసం ఎంతో మంది బీసీ, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల వారే కాకుండా... ల‌చ్చ‌న్న గారి, గౌతు ఫ్యామిలీ అభిమానులు.. ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. మ‌రి వారి ఆశ‌లు ఆమె ఎంత వ‌ర‌కు నెర‌వేర్చుతుందో ?  చూడాలి. ఇక బీసీ గౌడ + మ‌హిళా కోటాలో ఆమెకు భ‌విష్య‌త్తులో కేబినెట్ బెర్త్ ల‌క్ కూడా చిక్క‌వ‌చ్చేమో ?  అన్న‌ది కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: