ఆ ఎంపీ స్థానం.. మీ తాతల ఆస్తా.. రాహుల్‌పై మోదీ ఫైర్‌?

Chakravarthi Kalyan
రాహుల్‌ గాంధీ వల్ల పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారని.. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వాడే భాష మావోయిస్టుల భాషలా ఉండటం వల్ల ఆ పార్టీ, వారి మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు 50 సార్లు ఆలోచిస్తున్నారని  ప్రధాని మోదీ అంటున్నారు. కాంగ్రెస్‌కు, ఝార్ఖండ్ ముక్తి మొర్చాకు  అభివృద్ధి గురించి ఏమీ తెలియదన్న ఆయన ప్రతిచోటా బిగ్గరగా అబద్ధాలు మాట్లాడటమే తెలుసునని ప్రధాని మోదీ విమర్శించారు.

ప్రజల సంపదను ఎక్స్‌రే తీసి దోచుకోవడమే వారి లక్ష్యమని ప్రధాని మోదీ ఆరోపించారు. రిజర్వేషన్లను లాక్కోవాలని ఇండియా కూటమి భావిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలకు పాల్పడుతోందన్న ప్రధాని మోదీ.. లోక్‌సభ స్థానాలను తమ పూర్వీకుల ఆస్తులుగా పరిగణిస్తోందని వ్యాఖ్యానించారు. తన తల్లి స్థానమైన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌ను ఉద్దేశించి మోదీ ఈ విమర్శలు చేశారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను రాహుల్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు చెప్పాలని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: