తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో అద్భుతమైన హిట్లతో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ.. అలాంటి విజయ్ దేవరకొండ మొదట్లో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎంతో ఎదురు చూసి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ చివరికి పెద్ద స్టార్ అయ్యారు. అలాంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ అదరహో అనిపిస్తున్నారు.. అలాంటి విజయ్ దేవరకొండ మొదటిసారి సినీ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ ను దారుణంగా అవమానించారు.. ఎవరైనా సరే ఇంత పెద్ద హీరో అయినా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నీ పక్కన ఉండే వాళ్ళు కాదు నీకు ఎలాంటి టాలెంట్ లేనప్పుడు నీలో ఉన్న టాలెంట్ ని వెలికి తీసి బయటపెట్టిన వారే మొదటి గురువులు.
కానీ విజయ్ దేవరకొండ అవకాశం ఇచ్చిన మొదటి డైరెక్టర్లను సినిమాల గురించి మరిచిపోయి వాటి గురించి అసలు మాట్లాడనే మాట్లాడట.
తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈయన రవిబాబు డైరెక్షన్లో వచ్చిన నువ్విలా అనే చిత్రంలో చిన్న క్యారెక్టర్ చేశారు. ఇది ఆయనకు మొదటి సినిమా. కానీ అందరికీ తన ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం అనే చెబుతారట.. దీనికి ప్రధాన కారణం ఈ సినిమా గురించి చెబితే ఆయనకు సిగ్గుగా అనిపిస్తుందట. ఈ చిత్రాల్లో నా పర్ఫామెన్స్ అస్సలు నచ్చదని, అంతేకాకుండా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గురించి కూడా ప్రస్తావించానని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ విధంగా విజయ్ దేవరకొండ తనని మొదటిసారి సినిమాల్లోకి తీసుకువచ్చినటువంటి సినిమా గురించి కానీ డైరెక్టర్ గురించి కానీ ఎక్కడా ప్రస్తావించానని చెప్పడంతో ఈయనకు స్టార్డం వచ్చాక తల పొగరు పెరిగిపోయింది అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.. ఎందుకంటే ఎవరైనా సరే స్టార్ అయ్యాక తనకి మొదట అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారిని కచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం చేయకపోయి ఉంటే అసలు ఇండస్ట్రీకి వచ్చేవారు కాదు ముందు అది గుర్తుకు పెట్టుకోవాలి అంటున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాటలు విన్న కొంతమంది నెటిజెన్లు.