భువనగిరి( బూర నర్సయ్య గౌడ్): "బీసీ" ఫ్యాక్టర్ ఆ నేతకు కలిసివచ్చేనా.?

Pandrala Sravanthi

• భువనగిరి సెంటిమెంట్ నర్సయ్యకు కలిసి వస్తుందా..
• 'బీసీ' నినాదం పనిచేసేనా..
• కాంగ్రెస్ కంచుకోటలో గెలిచేదెవరు..?

తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత కీలకమైన పార్లమెంటు స్థానాలలో భువనగిరి కూడా ఒకటి. ప్రస్తుతం కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ ప్రాంతంలో ఈసారి మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంది. 2008లో ఏర్పడిన భువనగిరి లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. 2009, 2019లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 2014లో బీఆర్ఎస్ జండా ఎగరవేసింది. ఈ లోక్ సభ పరిధిలో మునుగోడు, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, జనగామ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 16 లక్షల కు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు దాదాపు 8లక్షల మంది ఉన్నారు. మహిళలు కూడా ఎనిమిది లక్షల చిల్లర ఉన్నారు. మరి అలాంటి ఈ భువనగిరి స్థానంలో జెండా ఎగరవేసేది ఎవరు.

పార్టీల బలాలు, బలహీనతలు ఏంటి అనే వివరాలు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో విజయం సాధించగా, బీఆర్ఎస్ ఒక్క స్థానంలో విజయం సాధించింది. అలాంటి ఈ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి  మల్లేష్ బరిలో ఉండగా,  కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు.  బిజెపి నుంచి బూర నర్సయ్య గౌడ్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురు నాయకులు భువనగిరి ప్రాంతంలో పట్టు సాధించిన వారే. అలాంటి ఈ తరుణంలో ఇక్కడ పోరు అనేది చాలా రసవత్తరంగా సాగనుంది. అయితే భువనగిరి పార్లమెంటులో ఒక ఆశ్చర్యకరమైన  సెంటిమెంట్ కొనసాగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి చెందిన నేతలు ఇక్కడ గెలుపొందరు. 2019 పార్లమెంటు ఎలక్షన్స్ లో అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు.

అంటే ఆ సమయంలో పూర్తిగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.  ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి అక్కడ తప్పనిసరిగా బీఆర్ఎస్ లేదంటే బిజెపి అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీసీ కార్డుపై బరిలోకి దిగిన బూర నర్సయ్య గౌడ్  మోడీ చరిష్మాతో గెలుపు తీరాలకు వెళ్తున్నాడని చెప్పవచ్చు.అంతేకాకుండా ఆయన గత మూడు నెలల నుంచి ప్రచారం సాగించి బిజెపి కీలక నేతలను ఇక్కడికి తీసుకువచ్చి ప్రచారం చేయించుకున్నారు. ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్, బిజెపి మధ్య ప్రధానమైన పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలో చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా బిజెపికే ఓటు వేసినట్టు సమాచారం. అక్కడ బిజెపి హవా ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ బూర నర్సయ్య గౌడ్ హవా ఎక్కువగా ఉంటుంది.  ఆయన సొంత ఇమేజ్ కలిసి వస్తుందని చెప్పవచ్చు.  ఇదే తరుణంలో ఈ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకోవడం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు.

 ఈ స్థానాన్ని గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఆయన మరింత ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తున్నారు.  ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు యువనేత రాహుల్ గాంధీని కూడా తీసుకువచ్చారు. ఈ విధంగా కాంగ్రెస్, బిజెపి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇదే తరుణంలో మూడవ స్థానానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ఎలాగైనా గెలవం కాబట్టి కాంగ్రెస్ ను ఓడించాలని చాలావరకు బీఆర్ఎస్ ఓట్లు బిజెపికి పడ్డట్టు సమాచారం అందుతుంది. అంతే కాకుండా బీసీలకు సంబంధించిన ఓట్లు కూడా బూర నర్సయ్య గౌడ్ వైపే మోగ్గినట్టు తెలుస్తున్నది. ఈ అంశాలు కనుక కలిసి వస్తే మాత్రం అక్కడ బిజెపి జెండా ఎగిరినట్టే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: