ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్... దేవర ముందుగానే రానున్నాడా..?

MADDIBOINA AJAY KUMAR
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇక ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

అనిరుధ్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని చాలా రోజుల క్రితం మేకర్స్ ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఈ సినిమాకు గ్రాఫిక్స్ పనులు అధికంగా ఉండడంతో ఈ మూవీ కి సంబంధించిన పనులు ఏప్రిల్ 5 వ తేదీ వరకు పూర్తి కావు అనే ఉద్దేశంతో ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కాకపోతే ఈ సినిమా అక్టోబర్ 10 కంటే చాలా రోజులు ముందే పూర్తి కానున్న నేపథ్యంలో ఈ మూవీ ని అక్టోబర్ లో కాకుండా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజంగానే ఈ సినిమాని అక్టోబర్ 10 వ తేదీన కాకుండా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కనక ప్రకటించినట్లు అయితే ఈ న్యూస్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ "దేవర" తో పాటు వార్ 2 కూడా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: