వాళ్లు వీళ్లు సరే.. గెలుపుపై YCP ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో తెలుసా?

praveen
ఈసారి ఆంధ్రాలో అధికారాన్ని చేపట్టబోయే పార్టీ ఏది అనే విషయం గురించి గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఎన్నో సంస్థలు సర్వేలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే అటు కూటమి ఇటు వైసిపి పార్టీల నేతలు అయితే తమదే విజయమని ఇక అధికారాన్ని చేపట్టబోయేది కూడా తామే అంటూ బల్ల గుద్ది మరి చెబుతున్నారు.

 అయితే కొంతమంది పైపైకి తమదే విజయం అని చెప్పుకుంటున్న.. ప్రజలు ఏం తీర్పును ఇచ్చారో అనే విషయంపై మాత్రం కాస్త టెన్షన్ పడిపోతున్నారు అని చెప్పాలి. అయితే 2019తో పోల్చి చూస్తే వైసీపీకి కొన్ని సీట్లు తగ్గినప్పటికీ మరోసారి అధికారాన్ని చేపట్టబోయేది మాత్రం ఫ్యాన్ పార్టీనే అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారట. అయితే విశేషములు అన్న తర్వాత ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. కానీ వైసీపీని అభిమానించి ఆ జెండాను మోసే అభిమానులు ఏమనుకుంటున్నారు అన్నది ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారే అంశం.

 అయితే కూటమి గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసిపి రెండోసారి ఆంధ్రాలో అధికారాన్ని చేదికించుకోవడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారట. జగన్ మరోసారి సీఎం కాబోతున్నారని అనుకుంటున్నారట. ఇచ్చిన హామీలను 95% కి పైగానే నెరవేర్చిన జగన్ కే మరోసారి ప్రజలు పట్టం కట్టబోతున్నారని బలంగా నమ్ముతున్నారట. గ్రేటర్ రాయలసీమలో 72 గాను 50 స్థానాలలో గెలుపు వైసిపిదే నని అనుకుంటున్నారట ఆ పార్టీ అభిమానులు  మరోవైపు ఉత్తరాంధ్రలో ఎంతో సులభంగా వైసిపి 10 స్థానాలకు పైగానే గెలుస్తుందని.. గోదావరి జిల్లాలో 7కు పైగా.. కృష్ణ గుంటూరు జిల్లాల్లో 15 నుంచి 16 సీట్లలో వైసిపి విజయ డంకా  మోగిస్తుందని అభిమానులు అనుకుంటున్నారట. ఇలా మొత్తంగా 90 కి పైగానే స్థానాల్లో విజయం సాధించి.. వైసిపి రెండోసారి అధికారాన్ని చేతికించుకుంటుందని బలంగా నమ్ముతున్నారట ఆ పార్టీ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: