ఎన్నికల్లో వినిపించని అరవింద్ పేరు.. కవితే కారణమా?

praveen
మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఉన్న కొద్ది సమయాన్ని కూడా తమ గెలుపు కోసం ఉపయోగించుకోవడం కోసం అన్ని పార్టీల నుంచి బలిలోకి దిగిన అభ్యర్థులందరూ కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు  ఇక ఉన్న ఈ కొంత సమయంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు అని చెప్పాలి. దీంతో ఇక రాజకీయం ఎక్కడ చూసినా మరింత వాడి వేడిగా మారిపోయింది.

 తెలంగాణలో కూడా ప్రధానంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది అని చెప్పాలి. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా అటు బీజేపీ అభ్యర్థుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. డీకే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్, మాధవి లత ఇలా చెప్పుకుంటూ పోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల కంటే అటు బిజెపి అభ్యర్థుల పేర్లే కాస్త గట్టిగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో మారు మోగిపోయిన ధర్మపురి అరవింద్ పేరు ఇప్పుడు పెద్దగా వినిపించడం లేదు. నిజాంబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు.

 అయితే గతం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పసుపు బోర్డు తీసుకురావడం సక్సెస్ అయిన ధర్మపురి  అరవింద్ కి  ఈసారి కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఒకప్పటిలా ఆయన పేరు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా వినిపించట్లేదు. దీనికి కారణం కవిత లాంటి ప్రత్యర్థి లేకపోవడం అనేది తెలుస్తుంది. 2019లో అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ కూతురు కవిత నిజాంబాద్ ఎంపీగా పోటీ చేయడంతో ఆమెకు ప్రత్యర్థిగా ఉన్న ధర్మపురి అరవింద్ పేరు గట్టిగా వినిపించింది. దానికి తోడు ఎక్కువ సంఖ్యలో రైతులు అక్కడ నామినేషన్ వేయడంతో ఇక ఈ పార్లమెంట్ సెగ్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇప్పుడు నిజాంబాద్లో బిఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీళ్ళు ధర్మపురి అరవింద్ కు బలమైన ప్రత్యర్ధులు కాదు అనే వాదన కూడా ఉంది. ఇలా ఒకప్పటిలా కేసిఆర్ కూతురు కవిత లాంటి బలమైన ప్రత్యర్ధులు లేకపోవడం.. ఇంకోవైపు రైతులు నామినేషన్ వేయకపోవడంతోనే ధర్మపురి అరవింద్ పేరు ఎక్కువగా వినిపించడం లేదు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: