దళపతి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఎట్టకేలకు జననాయగన్ రిలీజ్ డేట్ లాక్..!

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన దళపతి విజయ్ కెరియర్లో ఎంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం జననాయగన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్గా, మమిత బైజు కీలకమైన పాత్రలో నటిస్తోంది. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా గత కొన్ని వారాలుగా సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు, పొలిటికల్ డైలాగుల వివాదం వల్ల ఈ సినిమా ఆలస్యం అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోందని వినిపిస్తోంది.



ఇందుకు సంబంధించి చిత్ర బృందం సెన్సార్ బోర్డుకు ఒక కొత్త వెర్షన్ సమర్పించి కోర్టు కేసులను ఉపసంహరించుకునే విధంగా ప్లాన్ చేసినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాలలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ చిత్రమే చివరి సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు. అలాగే విలన్ గా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తూ ఉండడం గమనార్హం.


సుమారుగా రూ .400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న జననాయగన్ సినిమాకి  విజయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.200 కోట్లకు పైగా ఉన్నట్లు వినికిడి. డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.121 కోట్లకు  దక్కించుకుంది. అలాగే సాటిలైట్ రైట్ హక్కులను కూడా జీ తమిళ్ రూ .64 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా పైన నెలకొన్న వివాదం అని అనుకున్నట్లు  పరిష్కారమైతే, ఈనెల 20వ తేదీన థియేటర్లోకి రావడం ఖాయమని చెప్పవచ్చు. మరి ఈ విషయం పైన చిత్రబృందం అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: