వాసుపల్లి-కరణం రిటర్న్స్?

M N Amaleswara rao
టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు..మళ్ళీ టీడీపీలోకి రిటర్న్ అవుతారా? నలుగురులో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి చూస్తున్నారా? అంటే ఇటీవల సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళ ప్రచారం చూస్తుంటే అలాగే కనిపిస్తోంది...ఇద్దరు ఎమ్మెల్యేలు మళ్ళీ టీడీపీలోకి రావడానికి చూస్తున్నారని ప్రచారం చేస్తున్నారు..మరి ఈ ప్రచారమో లేక ఆ ఎమ్మెల్యేలని రాజకీయంగా దెబ్బకొట్టడానికి ఇలా ప్రచారం చేస్తున్నారో మాత్రం క్లారిటీ రావడం లేదు.
గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే...అయితే వైసీపీలో అధికారికంగా చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి..వంశీ వైసీపీ కండువా కప్పుకోకుండా జగన్ కు జై కొట్టారు...ఇక ఈయన బాటలోనే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వెళ్లారు. ఇలా నలుగురు వైసీపీలో చేరారు.
ఇంకా వీరితో చేరికలకు బ్రేక్ పడింది..ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో వలసలు ఆగిపోయాయి..అయితే రోజురోజుకూ వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని విశ్లేషణలు వస్తున్నాయి...ఇదే విషయాన్ని టీడీపీ శ్రేణులు ఎక్కువ ప్రచారం చేస్తున్నాయి..ఇంకా వైసీపీ పని అయిపోయిందని రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని అంటున్నారు...ఇక వైసీపీ పని అయిపోయిందని తెలిసి వైసీపీ వైపుకు వెళ్ళిన ఎమ్మెల్యేలు మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారని అంటున్నారు..ఇప్పటికే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి మళ్ళీ టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నారని కథనాలు వస్తున్నాయి...వైసీపీలో ఎలాగో ఈయనకు ప్రాధాన్యత దక్కడం లేదని, అందుకే మళ్ళీ టీడీపీలోకి రావడానికి చూస్తున్నారని, ఎలాగో వైసీపీలో అధికారికంగా చేరలేదు కాబట్టి, ఇబ్బంది లేకుండా టీడీపీలోకి రావాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.
ఇటు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సైతం అదే బాటలోనే ఉన్నారు..వైసీపీ వైపుకు వెళ్ళిన ఈయన మనసు టీడీపీపైనే ఉంది...అందుకే చంద్రబాబుని ఒక్క మాట కూడా అనరని చెబుతున్నారు..మరి చూడాలి ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ టీడీపీలోకి రిటర్న్ అవుతారో లేదో?    
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: