ఇజ్రాయిల్ దెబ్బకు.. స్మశానాల్లోనే ఉండిపోతున్నారు?

praveen
ప్రస్తుతం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని హమాస్ తీవ్రవాదులు దాడులతో వేడెక్కించారు. ఈ క్రమంలోనే తమ దేశ రక్షణ కోసం ఎలాంటి పని చేయడానికి అయినా వెనకడుగు వేయని  ఇజ్రాయిల్ ఏకంగా హమాస్ తీవ్రవాదులపై బాంబుల వర్షం కురిపిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గాజాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయ్. ఏకంగా సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ దాడులు నేపథ్యంలో గాజాలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తు ప్రతి ఒక్కరిని ఉనికి పడిన చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం ప్రాణాలతో ఉన్న ప్రజలు సైతం ఏ క్షణంలో బాంబు దాడి జరిగి ప్రాణాలు పోతుందో కూడా తెలియక అనుక్షణం ప్రాణాలను గుప్పెట్లో బ్రతుకుని క్షణక్షణ గండంగా బ్రతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్, హమాస్ తీవ్రవాదుల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇక గాజాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారి పోతున్నాయి అన్నది తెలుస్తుంది.

 ఏకంగా ఇజ్రాయిల్ బాంబుల దాడి నుంచి తమను తామును రక్షించుకునేందుకు ఎంతో మంది నిరాశ్రయులు శరణార్థి శిబిరాలలో ఆశ్రయం పొందుతున్నారు . అయితే శరణార్థులు తాకిడితో శిబిరాల్లో ఖాళీ లేకుండా పోతుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చివరికి స్మశాన వాటికలలో తలకాచుకుంటున్నారట. స్మశానంలో అయితే ఎలాంటి బాంబుదాడులు జరగవు అని భావిస్తూ చివరికి ఇక స్మశానాల మధ్యలోనే చివరికి శిబిరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు అన్నది తెలుస్తుంది. అయితే యుద్ధం ఆపేందుకు ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినప్పటికీ చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి. ఇలా హమస్ తీవ్రవాదులకు ఇజ్రాయిల్ కు మధ్య జరుగుతున్న యుద్ధం మాత్రం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: