ఇల్లు కొంటె భార్య ఫ్రీ.. వింతైన ఆఫర్.. ఎక్కడో తెలుసా?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా అనే భూతం ప్రపంచమంతా పాకిపోయింది. ఊరు వాడ అనే తేడా లేకుండా అంతటా ప్రజల్ని మాయలో పడేస్తోంది. ఈ క్రమంలోనే  సోషల్ మీడియాతో అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే మనిషి ప్రపంచాన్ని మొత్తం చుట్టెయ్య గలుగుతున్నాడు. అంతేకాదు ఎలాంటి శ్రమ లేకుండానే కావాల్సినవన్నీ కూడా ఇంటికి తెచ్చుకోగలుగుతున్నాడు. అయితే ఇక ఈ సోషల్ మీడియా ఎంతో మందికి ఆదాయాన్ని ఇచ్చే బంగారు బాతుగా కూడా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి.

 ఈ క్రమంలోనే ఇలా ఇంటర్నెట్లో వెలుగులోకి వచ్చే కొన్ని విషయాలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక విషయమే వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఎన్నో కంపెనీలు తమ బిజినెస్ ని పెంచుకోవడానికి వినూత్నమైన ఆఫర్లను ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి ఆఫర్లు అప్పుడప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే చైనాలో ఏకంగా ఒక కంపెనీ వింతైన ఆఫర్ ను ప్రకటించింది. ఇది కాస్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. చైనాలో కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయింది అన్న విషయం తెలిసిందే.

 దీంతో ఒక కంపెనీ తమ బిజినెస్ను పెంచుకోవడానికి వినూత్నమైన ఆఫర్లు ప్రకటించింది. ఏకంగా ఇల్లు కొంటె భార్య ఫ్రీ అంటూ ఆఫర్ పెట్టింది. టియాన్ జిన్ లోని ఓ కంపెనీ ఈ విచిత్రమైన ఆఫర్ పెట్టడం గమనార్హం. ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి అంటూ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. కాగా ఫ్రీ వైఫ్ డీల్ అనేది చైనాలో ద్వంద్వార్థంలో వాడే నానుడి. అదే ఫార్ములా వాడటంతో చివరికి అక్కడి అధికారులు సదురు కంపెనీకి జరిమానా విధించారు అని చెప్పాలి. ఏది ఏమైనా ఇల్లు కొంటె  భార్య ఫ్రీ అనడం మాత్రం ఎంతో వింతగా అనిపిస్తుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: