వామ్మో ఇవేమి ఎండలు బాబోయ్.. సిగ్నల్స్ కరిగిపోతున్నాయి?

praveen
భారత్ లో వర్షాలు బెంబేలెత్తిస్తు ఉంటే.. అటు యూకే లో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి.  అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భానుడు భగభగ మండిపోతున్నాయి. అయితే భారీ ఎండల నేపథ్యంలో యూరప్లోని పలు దేశాలలో కార్చిచ్చు చెలరేగింది అన్న విషయం తెలిసిందే. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్ క్రొయేషియా అంతటా కార్చిచ్చు  కారణంగా తీవ్రమైన వేడి గాలులతో.. ఎండలకు తోడు అటు ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

 అయితే ఎండలు తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు  ఎండల కారణంగా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది అని చెప్పాలి. అయితే యూకేలో ఎండల తీవ్రత ఎంతలా పెరిగి పెరిగిపోతుంది  అనడానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ఘటన ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయి ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తోంది అని చెప్పాలి. ప్రస్తుతం యూకేలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగిపోయాయి. ఫలితంగా రైలు సిగ్నల్స్ కూడా వేడికి కరిగిపోతూ ఉండటం గమనార్హం.


 ఈ క్రమంలోనే రైలు సిగ్నల్స్ పరిస్థితే ఇలా ఉంటే ఇక మనుషుల పరిస్థితి ఎలా ఉందో అని ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయిన ఫోటోలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. యూకే నేషనల్ రైల్వేస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కొన్ని  ఫోటోలని పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే భారీ ఎండల కారణంగా రైల్వే సిగ్నలింగ్ పరికరాలు కాలిపోయిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈస్ట్ కోస్ట్ ట్రైన్ లైన్ లో ప్రయాణించే ముందు మీ ప్రయాణాలను తనిఖీ చేయమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఎందుకంటే ఎండల కారణంగా తీవ్ర అంతరాయం కలగవచ్చు  అంటూ రైల్వే అధికారులు చెప్పడం గమనార్హం. ఇక మరో పోస్టులో చూసుకుంటే దంచికొడుతున్న ఎండల  కారణంగా భవనంలో ఉన్న ఫైర్ ఇంజన్ స్ప్రింకర్లు కూడా యాక్టివేట్ అవుతూ ఉండటం చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: