ఉక్రెయిన్ ఉద్రిక్తత.. భారతీయులకు ఇబ్బందులు?

praveen
ఉక్రెయిన్ రష్యా మధ్య ప్రస్తుతం సరిహద్దుల్లో ఏ స్థాయిలో ప్రతిష్టంభన కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే ఒకవైపు రష్యా తగ్గేది లేదు అనే విధంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికీ సరిహద్దులో లక్షల మంది సైనికులను మోహరించి నాలుగు వైపుల నుంచి ఉక్రెయిన్ పై దాడి చేసేందుకు సిద్ధమైంది రష్యా. అదే సమయంలోనే అటు అమెరికా యూరోపియన్ యూనియన్ నాటో దేశాల సహకారంతో రష్యా తో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోంది ఉక్రెయిన్.

 అయితే మరికొన్ని రోజుల్లో రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేసే అవకాశం ఉంది అని ఇప్పటికే అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం అసలు విషయాన్ని బయటపెట్టింది. ఏకంగా ఛాయా చిత్రాలతో సహా రష్యా ఎక్కడ సైన్యం మొహరించి అన్న విషయాన్ని తెలిపింది. అయితే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాలు ఇక ఉక్రెయిన్ లో ఉన్నటువంటి తమ పౌరులను, తమ రాయబారులను సిబ్బందిని కూడా వెనక్కి పిలుపునిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఏ క్షణం లో అయినా యుద్ధం తలెత్తే అవకాశం ఉంది అంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఇక అన్ని దేశాలు తమ పౌరులను వెనక్కి వచ్చి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసాయ్. ఇలాంటి సమయంలోనే కూడా భారత్ కూడా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి తమ పౌరులు వెనక్కి రావాలంటే ఆదేశాలు జారీ చేసింది. కానీ భారతీయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. ఉక్రెయిన్ నుంచి భారత తిరుగు పయనమయ్యేందుకు సిద్ధమైన భారతీయులకు అటు విమాన ధరలు ఒక్కసారిగా పెంచడం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయట. 25000 ఉన్న టికెట్ ధరను ఏకంగా లక్ష వరకు పెంచేయడంతో ఇది ఎంతో మంది భారత పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: