వాక్సిన్ పై చైనా డబుల్ గేమ్.. తైవాన్ గరం గరం?

praveen
తైవాన్ విషయం లో చైనా ప్రవర్తిస్తున్న తీరు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారి పోతుంది. స్వతంత్ర దేశం గా ఉండాలని అనుకుంటున్నాము అంటూ చిన్న దేశమైన తైవాన్ చెబుతుంటే తైవాన్లో అసలు స్వతంత్రం అనేది ఉండకుండా చేస్తానంటూ చైనా చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ ను తమ దేశం లో కలుపూకుంటాం అంటూ ఇప్పటికే ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చింది. ఇతర దేశాలు ఏవి కూడా తైవాన్ సంబంధాలు పెట్టు కునేందుకు వీలు లేదు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది చైనా. ఇలా తైవాన్ ఆక్రమించు కునేందుకు సిద్ధమైన నేపథ్యం లో ఆ దేశానికి అండగా మేమున్నాము అంటూ అమెరికా ముందుకు వచ్చింది.

 తైవాన్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ చెబుతూ అటు తైవాన్లో కాస్త ధైర్యం నింపింది. అదే సమయం  లో తైవాన్ లో ఉన్న సైనికులు అందరికీ శిక్షణ ఇచ్చేందుకు అమెరికా తమ సైన్యాన్ని కూడా అక్కడికి పంపించడం గమనార్హం. ఇలాంటి సమయం లోనే తైవాన్ అమెరికా మధ్య ఉన్న బంధాన్ని తెంచేందుకు ఇటీవల కాలంలో చైనా ఎన్నో ప్రయత్నాలు మొదలుపెట్టింది అని తెలుస్తోంది. అగ్రరాజ్యం తైవాన్ కోసం వ్యాక్సిన్లను పంపించింది. ఇక ఈ వ్యాక్సిన్ లు తైవాన్కు చేరకుండా ఉండేందుకు చైనా ఎన్నో కుట్రలు చేసింది.

 అయితే ఈ వ్యాక్సిన్లు తైవాన్ చేరకుండా ఉండేందుకు చైనా సముద్ర జలాలను పూర్తిగా మూసి వేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఇటీవలే తైవాన్ చైనా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారాలను సహించేది లేదు అంటూ అమెరికాలో జరిగిన ఒక మీటింగ్లో తైవాన్ చైనా పై గరం గరం  అయ్యింది.. అదే సమయంలో అమెరికా మంత్రి కలగజేసుకుని వ్యాక్సిన్లు తైవాన్ కు వచ్చే విధంగా చేయడంపై కృతజ్ఞతలు తెలిపింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: