తెలంగాణ స్టూడెంట్‌కు రూ.2 కోట్ల స్కాలర్‌షిప్..?

Suma Kallamadi
తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్వేతా రెడ్డి అనే పదిహేడేళ్ల స్టూడెంట్‌కు లాఫాయేట్ కాలేజీ అక్షరాల 2 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ ప్రకటించింది. అమెరికాలో బాగా ప్రసిద్ధి గాంచిన లాఫాయేట్ కాలేజీలో అడ్మిషన్స్ పొందాలంటే చాలా ప్రతిభ ఉండాల్సి ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ఈ కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నించి విఫలం అవుతుంటారు. ఐతే శ్వేతా రెడ్డి మాత్రం మొదటి ప్రయత్నంలోనే అడ్మిషన్ సాధించగలిగారు. నిజానికి ఆమె ప్రతిభకు ఫిదా లాఫాయేట్ కాలేజీ యాజమాన్యం ఫిదా అయిపోయి.. 4ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్‌ ఇచ్చింది. అంతే కాదు రెండు కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. అయితే ఈ కాలేజీ "డైయర్ ఫెలోషిప్" పేరిట స్కాలర్‌షిప్‌లు ప్రకటిస్తోంది. ఈసారి స్కాలర్‌షిప్‌కు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారు. వారిలో తెలుగు తేజం శ్వేతారెడ్డి ఒకరు కావడం సాటి తెలుగువారిగా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా లాఫాయెట్ కాలేజీ యాజమాన్యం మాట్లాడుతూ.. హైస్కూల్ స్థాయిలో శ్వేతారెడ్డి చూపించిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు తమను కట్టిపడేశాయని.. అందుకే ఆమెకు అడ్మిషన్‌తో పాటు స్కాలర్‌షిప్‌ను ప్రకటించామని వెల్లడించారు.
డైయర్ ఫెలోషిప్ స్కాలర్‌షిప్‌ పొందే అర్హత సాధించినందుకు గాను తాను ఎంతో గర్వంగా ఫీలవుతున్నానని శ్వేత సంతోషం వ్యక్తం చేశారు. తనకు లాఫాయెట్ కాలేజీలో ఈ అద్భుత అవకాశం రావడానికి డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహమే కారణమని ఆమె చెప్పుకొచ్చారు. డెక్స్‌టెరిటీ టూ కాలేజ్ అనేది ఇండియన్ హైస్కూల్స్, కాలేజీలలో యంగ్ లీడర్లకు ఇచ్చే ఒక కెరియర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో శ్వేత నాలుగు సంవత్సరాలపాటు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆమె అక్కడ నాయకత్వ పటిమతో పాటు సమస్యలను పరిష్కరించే స్కిల్స్ పెంపొందించుకున్నారు. కేరిర్‌లో తాను ఎదగడానికి సహాయపడ్డ డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ సీఈఓ శరద్ సాగర్‌కు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని.. ఆయనకు ఎప్పటికీ తాను రుణపడి ఉంటానని ఆమె వ్యాఖ్యానించారు.
ఇకపోతే శ్వేత స్కాలర్‌షిప్‌ సాధించడం పట్ల సీఈవో శరద్ సాగర్ స్పందించారు. నెక్స్ట్ జనరేషన్ కోసం లీడర్స్ ని తయారు చేయడమే తమ లక్ష్యమని సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. తమ సంస్థ యొక్క కెరియర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్ లో ట్రెయినింగ్‌ తీసుకున్న ఎందరో విద్యార్థులు ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీలలో అడ్మిషన్లు సాధించారని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: