ఎన్నారైలకు బిడెన్ గుడ్ న్యూస్
అలాగే వైట్ హౌస్ లో కూడా చాలా మంది మన వాళ్ళే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బిడెన్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అమెరికాలో భారతీయులు ఏర్పాటు చేసిన కొన్ని కొన్ని సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. దీనితో బిడెన్ వాళ్లకు ఆర్ధికంగా అండగా నిలవాలని భావిస్తున్నారు. భారతీయుల కంపెనీల మీద ఫోకస్ చేసి... అక్కడ ఉన్న యజమానులతో ఆయన సమావేశం కానున్నారు. వర్చువల్ మీటింగ్ త్వరలో జరగనుంది.
వ్యాపారులకు ఆర్ధిక సహాయం కూడా అందించే ప్రయత్నం బిడెన్ సర్కార్ చేసే అవకాశం ఉంది. దాదాపుగా వెయ్యి మందితో ముందు రాష్ట్రాల వారీగా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఈ సమావేశం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. భారతీయులు అమెరికా అభివృద్దిలో ముందు నుంచి కూడా చాలా కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు అమెరికా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ట్రంప్ ఉన్న సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో భారతీయులు ఉండేవారు. కాని ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేకుండా మార్చే ఆలోచనలో బిడెన్ ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఏం చేస్తారు ఏంటీ అనేది చూడాలి.