వ్యాక్సిన్ విషయంలో భారత్ ఏం చేస్తుంది...?
భారత్... అమెరికా మధ్య కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కి సంబంధించి ఇప్పుడు ఒప్పందం జరిగితే రష్యా వ్యాక్సిన్ ని భారత్ లో అందిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఇప్పుడు కొన్ని చర్చలు ఏంటీ అంటే... భారత్ కు మొత్తం 40 కోట్ల వ్యాక్సిన్ లను రష్యా నుంచి కొనుగోలు చేయాలని, అమెరికా జర్మని సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ని 40 కోట్లు తీసుకోవాలని, బ్రిటన్ భారత్ కలిసి తయారు చేస్తున్న వ్యాక్సిన్ ని 40 కోట్లు తీసుకోవాలని భారత్ భావిస్తుంది. భారత్ వ్యాక్సిన్ అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు.
60 శాతం ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు. రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాల వ్యాక్సిన్ లు మాత్రం 90 శాతం ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి మూడు దేశాల నుంచి సమానంగా వ్యాక్సిన్ తీసుకోవాలని యోచిస్తున్నారు. మరి దీనికి సంబంధించి కేంద్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటీ అనేది చూడాలి. ఈ వ్యాక్సిన్ లపై చాలా ఆశలు ఉన్నాయి. వచ్చే నెల నుంచి వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.