తెలంగాణలో యాదాద్రి అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే..ఆ మద్య మెదక్ లో ఆయుత చండీయాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో నిర్వహించనున్న లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణోత్సవానికి విచ్చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును అమెరికాలోని సిద్ధివినాయక కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్. ఉమాశంకర్ దీక్షిత్, సిఫీ డాట్‌కామ్ సంస్థ డెరైక్టర్ ఆనందరాజు ఆహ్వానించారు.
ఆగస్టు 17న ఈ కార్యక్రమంను నిర్వహించనున్నట్టు తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్‌ను నిర్వాహకులు సచివాలయంలో అంతకుముందే కలసి ఉత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఆగస్టు 20 నుంచి 28 వరకు నిర్వహించనున్న లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణోత్సవాల కోసం యాదాద్రి నుంచి దేవుని విగ్రహాలతోపాటు పది మంది అర్చకులను పంపేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సీఎంను కలిసిన వారిలో ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్ ఉమాశంకర్ దీక్షిత్, సిఫీ డాట్‌కామ్ డైరెక్టర్ ఆనంద్‌రాజు కలిశారు.