సమంతకు కొటిన్నర రూపాయలు ఇచ్చాడు

E. Rama Krishna
సమంతకు ప్రస్తుత రెమ్యునరేషన్ ఎంత అన్నదానిపై స్పష్టమైన లెక్క తెలియదు. ఎందుకంటే సమంత ఒక్కొరి దగ్గర, ఒక్కో విధంగా తీసుకుంటుంది అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సమంత కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సమంత ప్రస్తుతం కోలీవుడ్ లో సూర్య సరసన అంజాన్ అనే మూవీలో నటిస్తుంది. అంజాన్ మూవీలో సమంత ఎక్స్ పోజింగ్ ఎక్కువుగా ఉందంటూ వచ్చిన వార్తల వెనుక అసలైన నిజం ఏంటంటే, అ మూవీ కోసం సమంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుందని అంటున్నారు. అయితే ఇది కొంత వరకే నిజం. అసలు మేటర్ ఏంటంటే ఈ మూవీ తనకు సక్సెస్ ను తీసుకువస్తే, కోలీవుడ్ లో తనే నెంబర్ వన్ అని సమంత భావించింది. అందుకే అంజాన్ మూవీకు రెమ్యునరేషన్ ఎప్పటిలాగే తీసుకున్నప్పటికీ, తన హాట్ ఫోజ్ లను మాత్రం తనే కావాలని ఎక్కువుగా చూపిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన అంజాన్ మూవీ మేకింగ్ వీడియో సమంత పడ్డ కష్టానికి తమిళ ఆడియన్స్ సైతం శెభాష్ అంటున్నారట. దీంతో సమంతకు కోలీవుడ్ లో విపరీతమైన ఆధరణ వస్తుంది. అయితే సమంత వద్దకు తాజాగా ఓ నిర్మాత వచ్చి కోటి రూపాయల రెమ్యునరేషన్ తో తన మూవీలో నటించాలని అగ్రిమెంట్స్ తో వచ్చాడు. అందుకు సమంత మాత్రం కోటిన్నర రూపాయలు అయితే చేస్తాను అని చెప్పిందట. ఆ ప్రపోజల్ కు నిర్మాత సైతం ఒప్పుకొని, సమంత చేత అగ్రిమెంట్స్ పూర్తి చేసుకున్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: