నో డౌట్.. ప్రభాస్ ది ప్రేమ పెళ్లే ?
గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పై అనేక రూమర్స్ ను వండి వడ్డిస్తూనే ఉన్నారు రాతల రాయుళ్లు. అందులో భాగంగానే అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నారని.. పెళ్లి 'సాహో' విడుదల తరువాత ఉండబోతుందని ఇటీవలే వార్తలు పుట్టించారు. చివరికి ఈ వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని తేలింది. కాగా ప్రభాస్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా.. ‘పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అది ప్రేమ వివాహం కూడా కావొచ్చు’ అని ప్రభాస్ తెలిపారు. ప్రభాస్ పెళ్లి గురించి ఆ మధ్య రెబల్ స్టార్ కృష్ణంరాజు స్పందిస్తూ.. 'ప్రభాస్ చిన్నపిల్లాడు కాదు కదా పదేపదే పెళ్లి చేసుకోమని చెప్పడానికి. మా మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా త్వరలోనే చేసుకుంటానని ప్రభాస్ చెబుతూ ఉన్నాడని కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. దీని బట్టి పెళ్లి విషయంలో ప్రభాస్ దే తుది నిర్ణయం అని తేలిపోయింది. అంటే ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.