సాహో‌ లో‌ విలన్ పేరు ఇదా... ఇంత స్తైలిష్ గా ఉంటాడా??

Gowtham Rohith
ఆగస్టు 30న విడుదల కానున్న  ‘సాహో’ సినిమా కోసం ప్రచారాన్ని ఆ చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది.  దీంతో ప్రమోషన్స్  మరింత జోరుగా సాగుతున్నాయి.  ఇప్పటికే టీజర్, ట్రైలర్లు,  పాటలు, విడుదల చేసి ఫాన్స్ ను  ఆకర్షించారు. తాజాగా ఒక బాక్సింగ్ కిక్‌ బ్యాగ్‌ను ఎలా కొట్టాలో డైరెక్టర్ సుజిత్ చెబుతున్న సూచనలను చూపిస్తూ ఒక మేకింగ్ వీడియో‌ కూడా విదుదల చేశారు. ఇప్పుడు  'సాహో' టీమ్ తాజాగా 'సాహో' లో నటించే  నటీనటుల క్యారెక్టర్ పోస్టర్లు ఒక్కొక్కటిగా విడుదల చేయడం ప్రారంభించింది.  


అందులో భాగంగా మొదటి క్యారెక్టర్ పోస్టర్ అంటూ  విలన్  బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ పోస్టర్ ను విడుదల చేశారు.  తన స్టైలిష్  లుక్ తో ప్రేక్షకులను ను  సస్పెన్స్ పెంచుతున్న నీల్ నితిన్ ముకేష్ అంటూ ఆయన పోస్టర్ ను బయటపెట్టారు.  ఈ పోస్టర్ లో నీల్ నితిన్ ఒక లేత గోధుమ రంగు జాకెట్ ధరించి కళ్ళకు గాగుల్స్ తో స్టైలిష్ గా ఉన్నాడు.ఇందులో తన పేరు "జై" అని చెప్పారు.  చూస్తుంటే ఈ  సినిమా ఒక  సైఫై తరహాలో  ఉంది.

బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన నీల్ నితిన్ ముకేష్ కు ఇది టాలీవుడ్ లో మొదటి చిత్రం. మొత్తం మీద కొంచం కొంచం గా సినిమా మీద ఆశలు పెంచుతున్నారు . ఆగస్టు 30న విడుదల కానున్న  ఈ సినిమా  ఎన్ని రికార్డ్లు రాస్తుందో  వేచి చూడాలి.




Here is introducing you to #JAI from India’s Biggest Action Bonanza of 2019 SAAHO #Saaho releases worldwide on 30th August! #30AugWithSaaho #Prabhas @ShraddhaKapoor @sujeethsign @arunvijayno1 @UV_Creations @itsBhushanKumar @TSeries pic.twitter.com/LKKi6uBckg

— Neil Nitin Mukesh (@NeilNMukesh) August 5, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: